MP Raghunandan Rao (imagecredit:swetcha)
మెదక్

MP Raghunandan Rao: జీవితంలో గెలవాలంటే క్రమశిక్షణ ముఖ్యం: ఎంపీ రఘునందన్ రావు

MP Raghunandan Rao: యువత గెలవాలంటే క్రమశిక్షణ ముఖ్యమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విద్యార్థులకు తెలియజేశారు. మెదక్ పట్టణంలోని స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా యువజనోత్సవాలలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. స్వామి వివేకనంద చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మహిళా క్రికెట్లో భారత మహిళా..

ఈ సందర్భంగా ఎంపీ మాధవనేని రఘునందన్ రావు(Raghunandan Rao) మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో గెలవాలంటే క్రమశిక్షణ ఒక్కటే మార్గం అన్నారు. బట్టి చదువులకు స్వాస్తి చెప్పి విశ్లేషణాత్మకంగా చదవాలన్నారు. లక్ష్యం చేరాలంటే సోషల్ మీడియాను దూరంగా ఉంచాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మహిళా క్రికెట్లో భారత మహిళా జట్టు విజయం సాధించి 140 కోట్ల మంది భారతీయుల అభిమానాన్ని చురగోన్నారని గుర్తు చేశారు. యువతలో గెలుస్తానని తపన ఉండాలన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశ క్రీడల్లో వెనుకంజులో ఉందన్నారు. దాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి యువకులందరూ కృషి చేయాలి అన్నారు.

Also Read: Harassment Case: మహిళ లైంగిక వేదింపుల కేసులో.. కీలక విషయాలు వెలుగులోకి.. పరారీలో డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి!

తల్లిదండ్రులు ఆశయాలని..

ప్రతి వ్యక్తిలో యోగా(yOGA) నిత్యజీవితంలో భాగం కావాలన్నారు. యువకులు తల్లిదండ్రులు ఆశయాలని నెరవేరుస్తూ వాళ్ళ లక్ష్యాలను సాధించాలని కోరారు. తెలంగాణ(Telangana) నుంచి నిక్కత్ జరీన్(Nikkat Zareen)ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షీల్డ్, ప్రశంసా పత్రం అందించి, శలువతో ఎంపీ రఘు నందన్ రావు సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read: Home Remedies: చలికాలంలో జలుబు, దగ్గు సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

Just In

01

Wife Shocking Plot: కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయించింది.. దర్యాప్తులో నమ్మలేని నిజాలు

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అవినీతి అక్రమాలపై అదనపు ఎస్పీ శంకర్ విచారణ షురూ.. వెలుగులోకి సంచలనాలు

Revanth Reddy: ఈ నెల 11 లోగా కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tandur Protest: తాండూర్‌లో హైటెన్షన్.. పార్టీలకు అతీతంగా భారీగా కదిలొచ్చిన నేతలు..?

Baahubali rocket: ‘బాహుబలి’ సినిమా మాత్రమే కాదు.. తెలుగు ప్రజల గౌరవం..