Women Harassment: యువతిని వేధించిన వారిపై కేసు నమోదు
Women Harassment (imagecredit:swetcha)
క్రైమ్

Women Harassment: యువతిని వేధింపులకు గురి చేసిన డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కేసు నమోదు

Women Harassment: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళను వేధింపులకు గురిచేసిన డెంటల్‌ డాక్టర్, రియల్ ఎస్టేట్‌ వ్యాపారి పై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలో ఓ యువతిని వేధింపులకు గురిచేసిన డెంటల్‌ డాక్టర్(Dental doctor) రియల్ ఎస్టేట్‌ వ్యాపారి పై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రజావాణిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య(Commissioner Sai Chaitanya) ను కలిసి గోడును వెల్లిబుచ్చుకుని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

పాస్ పోర్ట్ కావాలంటూ ఏజెన్సీకి..

నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ యువతి 2021 సంవత్సరంలో ప్రగతినగర్‌లోని ఓ ట్రావెల్స్ ఏజెన్సీ(Travel agency)లో పనికి చేరింది. ఆమె పనిలో ఉన్న సమయంలో ఓ డెంటల్ డాక్టర్ విదేశాలకు వెళ్లేందుకు తనకు పాస్ పోర్ట్ కావాలంటూ ట్రావెల్స్ ఏజెన్సీకి వచ్చి సదరు యువతి సెల్‌ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. అనంతరం ఆ యువతి పలుసార్లు ఫోన్ చేస్తూ, అసభ్యంగా మాట్లాడుతూ తాము చెప్పిన చోటుకు వస్తే కావాల్సింనంత డబ్బులు ఇస్తామని వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నగరానికి చెందిన ఆయిల్ గంగాధర్(Oil Gangadhar) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి సైతం ఇదే రకంగా వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది.

Also Read: Shyamala Devi: ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్‌పై ప్రభాస్ పెద్దమ్మ ప్రశంసలు

వేధింపులు మితిమీరిపోవడంతో..

2023లో ఆమె పనిచేసే ట్రావెల్స్ ఏజెన్సీ నుంచి ఉద్యోగం మానేసి, వివాహం చేసుకొని ఉంటుంది. అయితే వీరిద్దరి నుంచి వేధింపులు మితిమీరిపోవడంతో సోమవారం బాధిత యువతి నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీపీ(CP) బాధితురాలి పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించాల్సిందిగా సంబంధిత నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్‌(SI Srikanth)ను ఆదేశించారు. దంత వైద్యుడు అమర్, రియల్ ఏస్టేట్ వ్యాపారి గంగాధర్ పై బిఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిఎన్ఎస్ 75, 78 క్లాజ్ 2 సెక్షన్‌ల కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దీంతో మంగళవారం డెంటల్ డాక్టర్ అమర్‌తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధర్‌పై నిర్భయ యాక్ట్(Nirbhaya Act) కింద కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Also Read: Ponnam Prabhakar: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక!

Just In

01

India World Cup Squad: టీ20 వరల్డ్ కప్‌కు జట్టుని ప్రకటించిన బీసీసీఐ.. సంచలన మార్పులు

Commissioner Sunil Dutt: జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోండి: సీపీ సునీల్ దత్

Bigg Boss Telugu 9 Winner: గ్రాండ్ ఫినాలే.. టైటిల్ పోరులో దూసుకుపోతున్న పవన్!.. విజేత ఎవరు?

GHMC: వ్యాపారస్తులకు జీహెచ్ఎంసీ అలర్ట్.. ఫ్రీ రెన్యూవల్ డెడ్‌లైన్ నేటితో క్లోజ్!

Jagan Birthday Cutout: వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం ముందు కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు