Shyamala Devi on Gummadi Narsaiah (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Shyamala Devi: ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్‌పై ప్రభాస్ పెద్దమ్మ ప్రశంసలు

Shyamala Devi: ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి పేరు ఈ మధ్య ఇండస్ట్రీ బాగా వినిపిస్తుంది. ఇండస్ట్రీలో ఏ చిన్న విషయం జరిగినా, ఆమె హాజరవుతుంది. ప్రభాస్ (Prabhas) పబ్లిక్‌లోకి రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారనే విషయం తెలియంది కాదు. ఆయన సిగ్గు ఎక్కువ. అందుకే పెద్దరికం మొత్తం శ్యామలా దేవి (Shyamala Devi)నే తీసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebel Star Krishnam Raju) మరణానంతరం, కుటుంబ బాధ్యతలను ఆమెనే తీసుకున్నారు. ఇండస్ట్రీలో కృష్ణంరాజుకు ఉన్న పెద్దరికాన్ని ఆమె బాధ్యతగా తీసుకుని, ప్రతి ఈవెంట్‌ను చక్కబెడుతున్నారు. దీనికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కూడా ‘గుమ్మడి నర్సయ్య’ (Gummadi Narsaiah) పేరుతో రూపుదిద్దుకుంటున్న బయోపిక్ మోషన్ పోస్టర్‌ను ప్రత్యేకంగా తిలకించిన ఆమె.. సినిమాపై ప్రశంసలు కురిపించి మరోసారి వార్తలలో హైలెట్ అవుతున్నారు.

Also Read- Bigg Boss Telugu 9: తనూజ ఏం మారలే.. అవే అరుపులు.. నిజంగా బిగ్ బాస్ సపోర్ట్ ఉందా?

అజాత శత్రువు, నిజాయితీ పరుడు

కొన్నాళ్ల క్రితం బయోపిక్‌లకు మంచి క్రేజ్ ఉండేది. ఈ మధ్యకాలంలో అంతగా అవి వర్కవుట్ కావడం లేదు. కానీ, ఒక వ్యక్తి జీవిత చరిత్రను తెరపైకి తీసుకు రావడం అంటే.. అంత సాధారణమైన విషయమేమీ కాదు. ఆ వ్యక్తి ఎంత గొప్పవాడు అయితేనో.. బయోపిక్ తీయాలని అనుకుంటారు. ‘గుమ్మడి నర్సయ్య’ కూడా ఒక గొప్ప వ్యక్తి, పైగా రాజకీయ నాయకుడు. ఆయన అజాత శత్రువు, నిజాయితీ పరుడు, ప్రజల కోసం బతికే నాయకుడిగా పేరు గడించిన గుమ్మడి నర్సయ్య వంటి వ్యక్తి చరిత్రను తెరపైకి తీసుకు వస్తుండటం ఒక రకంగా సాహసం అనే చెప్పాలి. ఆ సాహసాన్ని యంగ్ డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే (Parameshwar Hivrale) చేస్తున్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి (N Suresh Reddy) నిర్మిస్తున్న ఈ బయోపిక్‌లో కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించబోతోన్నారు.

Also Read- Mohan Babu: ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కలెక్షన్ కింగ్.. గ్రాండ్ ఈవెంట్ ఎప్పుడంటే?

రికార్డులు, ఎన్నో అవార్డులు

రీసెంట్‌గా ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా.. అది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. గుమ్మడి నర్సయ్య పాత్రలో శివ రాజ్ కుమార్ ఎలా కనిపిస్తారు? ఆయన మేరకు ఆకట్టుకుంటారు? అని అంతా అనుకుంటున్న సమయంలో.. అందరి అంచనాల్ని తలకిందులు చేసేలా.. గుమ్మడి నర్సయ్య పాత్రకు శివన్న ప్రాణం పోస్తున్నారనేలా మోషన్ పోస్టర్ క్లారిటీ ఇచ్చేసింది. ఆ పాత్రకు తగ్గ ఆహార్యంతో శివన్న అందరినీ ఆకట్టుకున్నారు. ఒక్క మోషన్ పోస్టర్‌తోనే దర్శకుడు పరమేశ్వర్ తన టాలెంట్ ఏంటో చూపించగా, ఈ మోషన్‌ పోస్టర్‌ను చూసిన శ్యామలా దేవి దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా శ్యామలా దేవి మాట్లాడుతూ.. ‘‘మోషన్ పోస్టర్ ఎక్సలెంట్‌గా ఉంది.. ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది.. సినిమా ఎలా ఉండబోతోందో అనేది. ఎన్ని అవార్డులు ఈ సినిమాకు వస్తాయో కూడా తెలుస్తోంది. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) ప్రాణం పెట్టి నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది.. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్. దర్శకుడు మంచి క్యాస్టింగ్‌ను ఎన్నుకున్నారు. కచ్చితంగా ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేసి, ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటుంది’’ అని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Prabhas: ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేయాల్సిన ‘బ్రహ్మరాక్షస్’ డౌటేనా?

Bigg Boss Buzzz: మాధురిపై శివాజీ కౌంటర్స్ చూశారా? ఇది వేరే లెవల్ అంతే..!

TPCC: జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ ‘ఉమెన్స్ వ్యూహం’.. రంగంలోకి 7 మహిళా బృందాలు.. ఏం చేస్తాయంటే?

RT76: ఆషికాతో రొమాన్స్‌లో రవితేజ.. షూటింగ్ అప్డేట్ ఇదే!

HYDRA: హైడ్రా ప్ర‌జావాణికి విశేష స్పందన.. సోమవారం ఎన్ని ఫిర్యాదులు అందాయో తెలుసా?