Ponnam Prabhakar: రవాణా శాఖ గౌరవాన్ని ప్రజల్లో, ప్రభుత్వంలో పెంపొందించేలా ఉద్యోగులు పని చేయాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హెచ్చరించారు. రవాణా శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని నివారణ చర్యలు చేపట్టాలని, అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read: Ponnam Prabhakar: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు, తీరనున్న కష్టాలు
ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడం వల్ల ప్రమాదం
ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్నెస్ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. వాహనాల స్పీడ్ లాక్ ఎంత వరకు అమలవుతున్నాయో చూడాలని, దానిని బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయాలని ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ సీరియస్ గా యాక్టివ్ గా ఉండాలని ఆదేశించారు. ఘటన జరిగినప్పుడు దాడులే కాదు.. నిరంతరం యాక్షన్ ప్లాన్ ఉండేలా కఠినంగా వ్యవహరించాలన్నారు. అధికారులు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి జిల్లాలో కఠినంగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేయవచ్చు అన్నారు. ప్రజలకు వేధింపులు లేకుండా రవాణా శాఖ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు.
వాహనాలపై వేధింపులు వద్దు
రవాణా శాఖ లో కొత్తగా వచ్చిన ఉద్యోగులకు సీనియర్లు సమన్వయం చేసుకుంటూ పని చేయాన్నారు. డీటీసీ ,ఆర్టీవో లు ఇతర రవాణా శాఖ అధికారులు ఒక్కో జిల్లాలో మూడు బృందాలుగా ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ధ్యానం తరలింపునకు ఉపయోగించే వాహనాలపై వేధింపులు వద్దు అని సూచించారు. కమర్షియల్ వాహనాలు , ప్రయాణికులను తరలించే వాహనాలు , మైన్స్ మినరల్స్ తరలించే వాహనాల్లో నిబంధనలు పాటించని వాహనాల్లో భారీ పెనాల్టీ తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రోడ్ సేఫ్టీ మంత్ ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి
నిబంధనలు పాటించని స్లీపర్ బస్సులు అందులో కార్గో సరుకులు తరలించిన కఠినంగా వ్యవహరించాలన్నారు. స్కూల్ బస్, హైర్ బస్ ఫిట్నెస్ లతో ట్రక్కులు ,టిప్పర్ లు , లారీలు వాటి ఫిట్నెస్ ఫర్మిట్ లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే రోడ్ సేఫ్టీ మంత్ ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని, దాని కన్నా ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చిన ప్రజల సహకారం అవసరం అన్నారు. తెలంగాణ లో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఆర్ అండ్ బీ నుంచి బ్లాక్ స్పాట్స్ గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ సీరియస్ గా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
Also Read: Ponnam Prabhakar: భారీ వర్షాలతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలు
