Free ChatGPT: టెక్ వరల్డ్‌ను ఆశ్చర్యానికి గురిచూస్తే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఏఐ చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’ (ChatGPT) మంగళవారం ఊహించని గుడ్‌న్యూస్ ప్రకటించింది. కంపెనీ సేవలను ఒక ఏడాది పాటు ఉచితంగా (ChatGPT Free Subscription) అందించనున్నట్లు వెల్లడించింది. యూజర్లకు 12 నెలలపాటు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. దీంతో, ఇన్నాళ్లూ పేమెంట్‌పై మాత్రమే లభించిన కొన్ని ముఖ్యమైన సర్వీసులు ఇకపై ఉచితంగా లభించనున్నాయి. చాట్‌జీపీటీ తీసుకున్న ఈ నిర్ణయం ఎడ్యుకేషన్, బిజినెస్, క్రియేటివిటీ రంగాలకు చెందినవారికి చాలా ఉపయోగపడుతుంది. టెక్ టూల్స్, ఏఐ సపోర్ట్, కంటెంట్ క్రియేషన్ సర్వీసులు వంటి వాటిని విద్యార్థులు, స్టార్టప్‌లు మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం దక్కినట్టు అయింది.
నిర్ణయం అనూహ్యమే.. కానీ పక్కా ప్లాన్
చాట్‌జీపీటీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ ఊహించలేదు. అయితే, ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ వెనుక ఉన్న పక్కా వ్యూహం, దూరదృష్టి వ్యాపార ప్రణాళికలు దాగి ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అనతికాంలోనే లాభాలు పొందడం కన్నా, యూజర్లలో దీర్ఘకాలికంపాటు నమ్మకాన్ని పెంచుకొని ఏఐ సేవల్లో పాతుకుపోవాలనే కంపెనీ వ్యూహంగా ఉంది. ప్రస్తుతం డిజిటల్ మార్కెట్‌లో ఏఐ సేవలు అందిస్తున్న కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ప్రతి కంపెనీ యూజర్లను ఆకర్షించేందుకు కొత్త ఆఫర్లు, సబ్‌స్క్రిప్షన్ మోడళ్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ఏడాదిపాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఇస్తూ చాట్‌జీపీటీ నిర్ణయం తీసుకుంది. సేవల విషయంలో యూజర్ల నమ్మకాన్ని పొందడమే దీని ముఖ్యోద్దేశంగా ఉంది. ఫ్రీ యాక్సెస్ ద్వారా ఎక్కువ మంది యూజర్లు ప్రత్యక్షంగా సేవలను పొందుతారు. ఒకసారి క్వాలిటీపై నమ్మకం ఏర్పడితే, ఆ తర్వాత చెల్లింపు సబ్‌స్క్రిప్షన్‌కు యూజర్లు ఏమాత్రం వెనుకాడబోరు అనేది కంపెనీ దీర్ఘకాల వ్యూహంగా అనిపిస్తోంది.
Read Also- The RajaSaab: ‘రాజాసాబ్’పై వస్తున్న వదంతులకు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. అది మాత్రం పక్కా..
జెమినీ ఏఐ నిర్ణయమే కారణమా!
ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ వెనుక టెక్ మార్కెట్‌లో తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకోవడం చాట్‌జీపీటీ లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, గూగుల్ ఏఐ చాట్‌బాట్ అయిన ‘జెమినీ ఏఐ’ ఇటీవల ఎవరూ ఊహించని ప్రకటన చేసింది. రియలన్స్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న జెమినీ ఏఐ.. జియో టెలికం యూజర్లు అందరికీ ఏడాదిపాటు ఉచితంగా సేవలు అందిస్తామని తెలిపింది. ఇప్పటికే మరో ఏఐ చాట్‌బాట్ ‘పర్‌ప్లెగ్జిటీ’ కూడా ఎయిర్‌టెల్ యూజర్లకు ఉచితంగా సేవలు అందిస్తోంది. మార్కెట్‌లో ఇంత పోటీ నెలకొనడాన్ని గ్రహించిన చాట్‌జీపీటీ, అన్ని కోణాల్లో ఆలోచించి ఫ్రీ-సబ్‌స్క్రిప్షన్‌ను ప్రకటించింది.
యూజర్లకు లాభం ఏమిటి?
ఉచిత సబ్‌స్క్రిప్షన్ కాలంలో యూజర్లకు చాలా ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి. ఆర్థిక భారం లేకుండానే ఏడాదిపాటు ప్రీమియం సేవలను ఉచితంగా పొందవచ్చు. ఎడ్యుకేషన్, బిజినెస్, క్రియేటివిటీ రంగాలకు చెందినవారు టెక్ టూల్స్, కంటెంట్ క్రియేషన్ సర్వీసులను ఫ్రీగా వాడుకోవచ్చు. యూజర్ల వినియోగం తీరు, ఆసక్తులు, ప్రాధాన్యతలను బట్టి మరింత మెరుగైన సేవలను కూడా పొందవచ్చు. యూజర్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కొత్త ఫీచర్లు, ఇంటర్‌ఫేస్ మార్పులు, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను చాట్‌జీపీటీ మార్పులు చేయనుంది. ఇప్పటికే మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చాట్‌జీపీటీ నిర్ణయంతో ఇతర కంపెనీలు సైతం తమ ప్లాన్లను రీడిజైన్ చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. యూజర్ల సంఖ్యను ఎంతవేగంగా పెంచుకుంటే, భవిష్యత్తులో యూజర్ ఆధారిత ఆదాయం బలంగా ఉంటుందనేది కంపెనీలు పసిగట్టినట్టుగా ‘ఫ్రీ సబ్‌స్క్రిప్షన్’ వ్యూహం వెనుక స్పష్టంగా అర్థమవుతోంది.
Read Also- Road Accidents Report: ఏపీలో 20 వేల రోడ్డు ప్రమాదాలు.. 8 వేల మరణాలు.. వెలుగులోకి సంచలన రిపోర్ట్
పరిమిత కాలపు ఆఫర్
ఫ్రీ-సబ్‌స్క్రిప్షన్ పరిమితి కాలపు ఆఫర్ అని చాట్‌జీపీటీ చెబుతోంది. టర్మ్స్ అండ్ కండీషన్స్ అన్ని తెలుసుకొని సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాలి. ఎందుకంటే, ఫ్రీ యూజర్ల నుంచి కూడా కంపెనీ డేటా సేకరించవచ్చు. కాబట్టి, ప్రైవసీ పాలసీను తప్పనిసరిగా చదవాలి. సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ అయినప్పటికీ, అకౌంట్ వేరిఫికేషన్ అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఏడాది తర్వాత పరిస్థితి ఏంటనేది కంపెనీ తీసుకోబోయే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆఫర్‌లు, లేదా డిస్కౌంట్‌లు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇక, కొత్తగా రిజిస్టర్ అయ్యే యూజర్లకు మాత్రమే ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ వర్తిస్తుందని చాట్‌జీపీటీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న చెల్లింపు యూజర్లు తమ ప్రస్తుత ప్లాన్ పూర్తయ్యాక ఈ ఫ్రీ ఆఫర్ పొందవచ్చని వివరించింది.
How to Cancel ChatGPT AutoPay on Web, Android, and iPhone 💡
If you’ve already subscribed to ChatGPT Go, cancelling AutoPay won’t end your current subscription. It will simply prevent any amount from being deducted after your free year ends.
🌐 On the Website
1. Log in to… pic.twitter.com/1IMZu5HU7P— Abhishek Yadav (@yabhishekhd) November 4, 2025
