Ram Gopal Varma: రిషబ్ శెట్టిని అంత మాట అన్నాడేంటి ఆర్జీవీ..
ram-gopal-varma( image :x)
ఎంటర్‌టైన్‌మెంట్

Ram Gopal Varma: రిషబ్ శెట్టిని అంత మాట అన్నాడేంటి ఆర్జీవీ.. అందుకేనా..

Ram Gopal Varma: ప్రపంచ వ్యాప్తంగా ‘కాంతార చాప్టర్ 1’ విడుదలై రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రిషబ్ శెట్టి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఎవరు ఏం అన్నా ఆర్జీవీ స్పందన మాత్రం వేరే లెవెల్. ఆయన ఒక సినిమా గురించి గానీ వ్యక్తి గురించి గానీ మాట్లాడారు అంటే ఆది గొప్పది అయి ఉండవచ్చు. అయితే తాజాగా కాంతార హీరో రిషబ్ శెట్టిపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎవరూ అనుకోని విధంగా ఆర్జీవీ స్పందించారు. దీంతో కాంతార అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పటికే సినిమా గురించి ఎన్టీఆర్, మారుతి, తదితరులు ప్రస్తావించగా తాజాగా ఆర్జీవీ స్పందన గురించి మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకూ ఆయన ఏ విధంగా స్పందించారు అంటే.. రిషబ్ శెట్టిని పొగడ్తలతో ముంచెత్తారు.

Read also-Vijay Rashmika: సన్నిహితుల మధ్య సీక్రెట్‌గా రష్మిక, విజయ్ దేవరకొండల నిశ్చితార్థం

ఆర్జీవీ ఏం అన్నారు అంటే..‘ రిషబ్ శెట్టి నేను నిజంగా చెప్తున్నాను నువ్వు సినిమా అభిమానివి కాదు.. సినిమా ఎలా ఉండాలో.. ఎలా తీయాలో.. ఎలా ఉంటే ప్రేక్షకులు చూస్తారో తెలుసుకుని అలాగే సినిమా తీసి చూపించి హిట్ కొట్టిన వాడివి. ఎందుకు అంటే దర్శకులు అందరికీ ఇదొక పాఠం. నువ్వు తీసిన సినిమా ఎంతో మందికి రిఫరెన్స్ అవుతుంది. సినిమా దర్శకులు ‘కాంతార చాప్టర్ 1’ సినిమాను చూసి ఎలా సినిమా తీయాలో చూసి నేర్చుకుంటారు. ఈ సినిమా కొత్త తరానికి నాంది. ఈ సినిమా చూసిన తర్వాత సినిమా మళ్లీ పుట్టింది అనుకొవచ్చు. ఈ సినిమా చూస్తుంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. ఈ సినిమా వివరించడానికి మాటలు రావడం లేదు చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి సినిమాను చూశాను. సినిమా తీయడంలో ప్రతి సెకను మీరు పడిన తపన అందులో కనిపిస్తుంది. సినిమా ప్రేక్షకులకు ఇదొక ఫీస్ట్ లా ఉంది.’ అంటూ ఆర్జీవీ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. దీనిని చూసిన రిషబ్ శెట్టి మీలాంటి వారి అభినందనలు మాలాంటి వారికి చాలా అవసరం అంటూ బదులిచ్చారు. సాధారణంగా స్పందించని ఆర్జీవీ ఇలా చెప్పడంతో సినిమా కు మరింత ఊతం వచ్చినట్లు అయింది.

Read also-Rohit Future: రోహిత్ శర్మ, కోహ్లీ భవితవ్యం ఏమిటి? సెలక్టర్ల మనసులో ఉన్నది ఇదేనా?

ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. కేవలం రెండు రోజుల్లోనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతోంది. సాంప్రదాయ సంస్కృతి, ప్రకృతి, అద్భుత కథలను మేళవించిన ఈ సినిమా విమర్శకుల నుంచి కూడా ఘనంగా ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో థియేటర్లు పండుగా మారాయి. ఓ నివేదిక ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు భారతదేశంలో భాషల వారీగా నెట్ కలెక్షన్ రూ. 61.85 కోట్లు చేరింది. దీన్ని విభజించాలంటే, కన్నడ వెర్షన్ రూ. 19.6 కోట్లు, తెలుగు రూ. 13 కోట్లు, హిందీ రూ. 18.5 కోట్లు, తమిళ రూ. 5.5 కోట్లు, మలయాళం రూ. 5.25 కోట్లు సాధించాయి. మొదట రీజియనల్ చిత్రంగా మొదలైన ఈ కథ పాన్-ఇండియా స్థాయిలో ఇంత హలచల్ చేస్తుందని ఫ్యాన్స్‌కు, ఇండస్ట్రీకి కూడా అప్పుడే అద్భుతంగా అనిపించింది. రెండో రోజుకు ఈ వసూళ్లు రూ.105 కోట్లకు చేరుకున్నాయి. ఈ సినిమా రూ.1000 కోట్లు మార్కెట్ చేస్తుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.

Just In

01

Delhi Flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ముంబై ఫ్లైట్ ఢిల్లీకి తిరిగి మళ్లింపు

Gold Rates: బిగ్ షాక్.. ఒక్క రోజే అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Gade Innaiah: తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్ట్‌కు కారణాలు అవేనా..?

James Ransone: హాలీవుడ్‌కు తీరని లోటు.. జేమ్స్ రాన్సోన్ 46 ఏళ్ల వయసులో కన్నుమూత

Engineering Fees: ఇంకా విడుదల కాని జీవో.. ఇంజినీరింగ్ ఫీజులపై నో క్లారిటీ!