Engineering Fees: ఇంకా ఇంజినీరింగ్ ఫీజులపై నో క్లారిటీ!
Engineering Fees (imagecredit:twitter)
Telangana News

Engineering Fees: ఇంకా విడుదల కాని జీవో.. ఇంజినీరింగ్ ఫీజులపై నో క్లారిటీ!

Engineering Fees: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తో పాటు, ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై, మొదటి సెమిస్టర్ పరీక్షలు సమీపిస్తున్నా విద్యార్థులు పాత ఫీజులు కట్టాలా, లేక పెంచిన కొత్త ఫీజులు చెల్లించాలా అనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కరువైంది. దీంతో అటు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇటు కాలేజీ యాజమాన్యాలు అయోమయంలో ఉన్నాయి. 2025 – 27 బ్లాక్ పీరియడ్‌కు కొత్త ఫీజుల జీవోను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే, ఆ జీవో ఇంకా విడుదల చేయలేదు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారిస్తూ తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నెల రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్‌ను సమర్పించింది. ప్రభుత్వం ఈ ఫీజులకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాతే జీవోను విడుదల చేస్తారు. జీవో విడుదలైతేనే కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. 2025 – 26 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై మొదటి సెమిస్టర్ కూడా కావొస్తున్నా ఇంతవరకు ఫీజుల అంశాన్ని కొలిక్కి తీసుకు రాలేదు. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

జాప్యానికి అదే కారణం

గత కొద్ది కాలంగా ఫీజుల పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) సిఫార్సుల మేరకు జీవో విడుదల చేయాల్సి ఉన్నది. అయితే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. కోడ్ ముగిసిన తర్వాత ఫీజులపై నిర్ణయం తీసుకుంటారని భావించినప్పటికీ, విద్యా శాఖకు చెందిన కీలక అధికారులు సెలవుపై వెళ్లడం ఈ జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తున్నది. వాస్తవంగా ఏ కాలేజీకి ఎంత ఫీజు ఉండాలో ఇప్పటికే ఫైనల్ చేశారు. అయితే, దీనికి ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆమోదం లభించాలి. కానీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో జీవో విడుదల విషయంలో ఆలస్యం జరిగింది. అప్పట్లో జీవో విడుదలకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల అధికారులను విద్యాశాఖ అధికారులు కోరినట్లు తెలిసింది. అనుమతి వచ్చిన వెంటనే జీవోను ప్రభుత్వం విడుదల చేస్తుందని కాలేజీల యాజమాన్యాలు భావించాయి. కానీ ఉత్తర్వులు విడుదల చేయలేదు. ఆ తర్వాతైనా ఓ నిర్ణయం తీసుకుంటుందని అనుకునే లోపే గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.

Also Read: Task Force: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ప్రక్షాళన చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ

కొత్త ఫీజులు అమలవుతాయా?

ఇంజినీరింగ్ ఫీజుల నిర్ధారణకు ఇంజినీరింగ్ కాలేజీల విచారణ ప్రక్రియ అక్టోబర్ నెలలోనే ముగిసింది. ఫీజుల నిర్ధారణకు సంబంధించి రాష్ట్రంలోని 160 ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలను టీఏఎఫ్‌ఆర్‌సీ విచారించింది. తొలుత ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఈ హియరింగ్‌ను చేపట్టింది. అయితే, టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ధారించిన ఫీజులు కొన్ని కాలేజీలకు అనుకూలంగా ఉన్నాయని, ఎలాంటి విద్యా ప్రమాణాలు పాటించని కాలేజీల్లోనూ ఫీజులు భారీగా పెంచేశారని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఫీజులను ఖరారు చేయాలని అప్పట్లో ఆదేశించింది. ప్రభుత్వ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణ చేపట్టింది. తొలిసారి విచారణ చేపట్టినప్పుడు కాలేజీలు సమర్పించిన రిపోర్టులు సరైనవేనా, ఒకవేళ ఇచ్చిన నివేదికల్లో ఏమైనా తప్పుడు లెక్కలు, సమాచారం ఉంటే చర్యలు తీసుకునేలా అఫిడవిట్లను సైతం తీసుకున్నది. కాలేజీల్లో ఎలాంటి వసతులున్నాయి, ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, భవనాలు తదితర వివరాలను పరిగణనలోకి తీసుకొని ఫీజులను ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయినా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. దీంతో అసలు ఈ ఏడాది కొత్త ఫీజులు అమలవుతాయా లేదా అనే సందేహాలు కాలేజీల యాజమాన్యాల్ల

జీవో కోసం డిమాండ్

సాధారణంగా కౌన్సెలింగ్ సమయానికే ఫీజులు ఖరారు కావాల్సి ఉంటుంది. కానీ, ఈసారి విద్యా సంవత్సరం సగానికి పైగా గడిచిపోయినా స్పష్టత లేదు. మొదటి సెమిస్టర్ సిలబస్ దాదాపు పూర్తయి, పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలోనూ ఫీజుల జీవో రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం కొలిక్కి రాకపోవడంతో ఈ విద్యా సంవత్సరం పాత ఫీజులనే అమలు చేస్తున్నారు. ఒక వేళ ఫీజులు పెరిగితే ఇప్పుడు కట్టిన ఫీజు పోను మిగతా మొత్తాన్ని కాలేజీలకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, గత బ్లాక్ పీరియడ్‌తో పోలిస్తే ఈసారి ఎంతో కొంత ఫీజులను పెంచే అవకాశమే ఉంటుంది. ఇదే ఇప్పుడు ప్రభుత్వానికి సమస్యగా మారినట్లు తెలుస్తున్నది. ఫీజులు పెరిగితే ప్రభుత్వంపై భారం పడుతుందని, అందుకే నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అవుతున్నట్లుగా పలు కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా యాజమాన్యాలు మాత్రం పెరిగిన నిర్వహణ ఖర్చుల దృష్ట్యా కొత్త ఫీజులే వసూలు చేస్తామని పట్టుబడుతున్నాయి. కొన్ని కాలేజీలు అండర్ టేకింగ్ ఫామ్స్ తీసుకుని తాత్కాలికంగా అడ్మిషన్లు చేసుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అకస్మాత్తుగా భారీగా పెంచిన ఫీజులతో జీవో ఇస్తే, ఒకేసారి అంత మొత్తం చెల్లించడం భారమవుతుందని తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి, తక్షణమే ఫీజుల జీవో విడుదల చేసి ఈ అనిశ్చితికి తెరదించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read: Rail Ticket Hike: బిగ్ బ్రేకింగ్.. టికెట్ రేట్లు పెంచిన రైల్వే.. ఎంత పెరిగాయో తెలుసా?

Just In

01

Pawan Sacrifice: ‘హరిహర వీరమల్లు’ సినిమా అంత పని చేసిందా?.. వాటి అప్పులు కట్టడానికి పవన్ ఏం చేశారంటే?

Artificial Intelligence: డాక్టర్లు గుర్తించలేకపోయారు.. Grok AI వల్లనే బతికానంటున్న 49 ఏళ్ల వ్యక్తి

Delhi Flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ముంబై ఫ్లైట్ ఢిల్లీకి తిరిగి మళ్లింపు

Gold Rates: బిగ్ షాక్.. ఒక్క రోజే అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Gade Innaiah: తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్ట్‌కు కారణాలు అవేనా..?