James Ransone: ‘ది వైర్’ నటుడు జేమ్స్ రాన్సోన్ కన్నుమూత
James Ransone ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

James Ransone: హాలీవుడ్‌కు తీరని లోటు.. జేమ్స్ రాన్సోన్ 46 ఏళ్ల వయసులో కన్నుమూత

 James Ransone: హాలీవుడ్ నటుడు, ప్రముఖ వెబ్ సిరీస్ ” ది వైర్ ” తో గుర్తింపు పొందిన జేమ్స్ రాన్సోన్ (46) కన్నుమూశారు. భార్య, ఇద్దరు పిల్లలను వదిలి ఆయన మరణించడంతో హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. లాస్ ఏంజెలెస్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ వెల్లడించిన వివరాల ప్రకారం, గత శుక్రవారం రాత్రి జేమ్స్ రాన్సోన్ ఆత్మహత్య చేసుకుని మరణించారు.

Also Read: Gadwal District: పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థుల మనోవేదన.. అప్పులపాలై ఆగమాగం అంటూ..!

HBO రూపొందించిన ది వైర్ సిరీస్‌లో జిగ్గీ సోబోట్కా పాత్రతో రాన్సోన్ విశేషమైన గుర్తింపు పొందారు. అలాగే ఇట్: చాప్టర్ టూ చిత్రంలో ఎడ్డీ పాత్రకు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, జేమ్స్ రాన్సోన్ చాలా కాలంగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 2021లో ఆయన స్వయంగా ముందుకు వచ్చి తన బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా వెల్లడించారు. తనకు బాల్యంలో బోధకుడిగా ఉన్న టిమోతి రువాలో అనే వ్యక్తి, తన ఇంట్లోనే ఆరు నెలల పాటు పలుమార్లు తనను వేధించాడని రాన్సోన్ తెలిపారు.

Also Read: Bhatti Vikramarka: బడ్జెట్ ప్రతిపాదనలు కోరిన ఆర్థిక శాఖ.. జనవరి 3లోగా రిపోర్ట్ పంపాలని కేంద్రం ఆదేశం

ఆ అనుభవాలు తన జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయని, అవి తనలో నేరభావనను పెంచి మద్యం, మత్తు పదార్థాల బానిసత్వానికి దారితీశాయని ఆయన గతంలో చెప్పుకొచ్చారు. అయితే 2006లో రాన్సోన్ ఆ వ్యసనాల నుంచి బయటపడి పూర్తిగా కోలుకుని, నటనలో స్థిరపడగలిగారు.

Also Read: Civil Supplies Scam: వాట్సాప్‌లో స్కానర్ పెట్టిమరీ.. దర్జాగా కమీషన్ల దందా చేస్తున్న ఓ సివిల్ సప్లై అధికారి..?

ది వైర్ తర్వాత ఆయన కెరీర్ మరింత ముందుకు సాగింది. టెలివిజన్ సిరీస్‌లు, సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలను అధిగమించి నిలదొక్కుకున్నప్పటికీ, మానసిక పోరాటం ఆయనను వెంటాడుతూనే ఉందని సన్నిహితులు చెబుతున్నారు. జేమ్స్ రాన్సోన్ అకాల మరణం హాలీవుడ్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సహనటులు, దర్శకులు, అభిమానులు సోషల్ మీడియా నుంచి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

Just In

01

Pawan Sacrifice: ‘హరిహర వీరమల్లు’ సినిమా అంత పని చేసిందా?.. వాటి అప్పులు కట్టడానికి పవన్ ఏం చేశారంటే?

Artificial Intelligence: డాక్టర్లు గుర్తించలేకపోయారు.. Grok AI వల్లనే బతికానంటున్న 49 ఏళ్ల వ్యక్తి

Delhi Flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ముంబై ఫ్లైట్ ఢిల్లీకి తిరిగి మళ్లింపు

Gold Rates: బిగ్ షాక్.. ఒక్క రోజే అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Gade Innaiah: తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్ట్‌కు కారణాలు అవేనా..?