Delhi Flight: ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానం గాల్లో సాంకేతిక సమస్య రావడంతో సోమవారం ఉదయం ఢిల్లీకి తిరిగి వచ్చింది. మీడియా కథనం ప్రకారం, ఫ్లైట్ AI-887లో కుడి వైపు ఇంజిన్ మధ్య గాల్లో పనిచేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Zubeen Garg: జుబీన్ గార్గ్ మరణంపై అధికారిక ప్రకటన.. అనుమానాలకు చోటు లేదని క్లారిటీ ఇచ్చిన పోలీసులు
ఉదయం 6.10 గంటలకు ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం, సుమారు 6.52 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ సురక్షితంగా చేర్చినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.
రెండు ఇంజిన్లతో నడిచే విమానాలు ఒక ఇంజిన్ పనిచేయకపోయినా సురక్షితంగా ల్యాండ్ కావచ్చని విమానయాన నిపుణులు వెల్లడించారు. ఈ ఘటనపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
Also Read: Pade Pade Song: సంగీత ప్రియులను కట్టి పడేస్తున్న ఆది సాయికుమార్ ‘శంబాల’ నుంచి పదే పదే సాంగ్..
ఈ సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఎయిర్ ఇండియా చర్యలు చేపట్టింది. ప్రయాణికులను ముంబైకి తీసుకెళ్లేందుకు మరో బోయింగ్ 777 విమానం (VT-ALP)ను ఏర్పాటు చేసింది. అలాగే, బోర్డింగ్ గేట్ వద్ద ప్రయాణికులకు ఆహారం, పానీయాలు అందించినట్లు సంస్థ తెలిపింది.ఈ ఘటనతో కొద్దిసేపు ప్రయాణికుల్లో ఆందోళన నెలకొనగా, విమాన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.

