Vijay Rashmika: టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నా (Rashmika Mandanna)లు రహస్యంగా నిశ్చితార్థం (ఎంగేజ్‌మెంట్) చేసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. చాలా కాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై సినీ వర్గాల్లో, అభిమానుల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ వార్త సినీ పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తమ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్‌లో నిశ్చితార్థం (Engagement) చేసుకున్నట్లుగా సమాచారం. ఈ వేడుకను ఇద్దరూ చాలా గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు లేదా వివరాలు ఏవీ బయటకు రాలేదు. కొన్నేళ్లుగా చెన్నై, ముంబై, గోవా వంటి ప్రాంతాల్లో వీరిద్దరూ తరచుగా కలిసి కనిపించడం, వెకేషన్స్‌కి వెళ్లడం వంటివి అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. అయితే, తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమే అని ఈ జంట ఇప్పటి వరకు పదేపదే చెబుతూ వచ్చింది. కానీ, వారిద్దరూ కలుసుకునే ప్రదేశాలు, వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని తెలియజేస్తూనే ఉన్నాయి.
Also Read- Tollywood Actor: మూవీ రిలీజ్‌పై డైరెక్టర్‌తో రూ. లక్ష పందెం కట్టిన నటుడు!
నిశ్చితార్థం పూర్తి.. ఫిబ్రవరిలో పెళ్లి?
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. వీరిద్దరూ సన్నిహితుల మధ్య సీక్రెట్‌గా నిశ్చితార్థం ముగించేశారని, అతి త్వరలోనే ఈ జంట తమ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాదు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారు వివాహం చేసుకోనున్నారనేలా సమాచారం అందుతుంది. వీరి వివాహానికి వేడుక కాబోయే వేదికకు కూడా ఎంతో విశిష్టత ఉండబోతుందట. వీరిద్దరూ కలిసి చేసిన ‘గీత గోవిందం’ సినిమా టైమ్ నుంచి.. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, కానీ వారి కెరీర్‌పై ఆ ఎఫెక్ట్ పడకుండా, ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారనే విషయం తెలియంది కాదు. ఏ అకేషన్ చూసినా, విజయ్ దేవరకొండ ఇంట్లోనే రష్మిక మందన్నా కనిపించడం, ఆనంద్ దేవరకొండ సినిమాలకు దగ్గరుండి ప్రమోట్ చేయడం వంటి విషయాలు కూడా వీరి మధ్య ప్రేమను తెలియజేస్తూ వచ్చాయి. అలాగే వీరి సినిమాలు విడుదలైనప్పుడు ఒకరినొకరు అభినందించుకునే క్రమం కూడా అందరిలో అనుమానాలను నింపింది. ఇక ఆ అనుమానాలకు తెరదించుతూ.. త్వరలోనే వారిద్దరూ ఒకటవబోతున్నారనే విషయాన్ని ఈ నిశ్చితార్థంతో క్లారిటీ ఇచ్చేశారు.
Also Read- Akshay Kumar: అలాంటి ఫొటోలను పంపుతారా? తన కుమార్తెకు ఎదురైన షాకింగ్ ఘటనను తెలిపిన అక్షయ్!
అప్పటి నుంచే అనుమానాలు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన ‘గీత గోవిందం’ (2018), ‘డియర్ కామ్రేడ్’ (2019) చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ చిత్రాలలో వారి కెమిస్ట్రీని చూసినప్పటి నుంచే, అభిమానులు వీరిద్దరూ నిజ జీవితంలో ఒక్కటైతే బాగుండని ఆకాంక్షించారు. అందుకే, ఈ వార్త నిజమైందని అప్పుడే అభిమానులు సోషల్ మీడియాలో వారికి శుభాకాంక్షలు చెబుతుండటం విశేషం. త్వరలో విజయ్ దేవరకొండతో మరోసారి ఆమె నటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ స్టార్ జంట నిశ్చితార్థం, పెళ్లి తేదీ ఇంకా ఇతర వివరాలు ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారనేది తెలియాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
