Akshay Kumar on cyber period
ఎంటర్‌టైన్మెంట్

Akshay Kumar: అలాంటి ఫొటోలను పంపుతారా? తన కుమార్తెకు ఎదురైన షాకింగ్ ఘటనను తెలిపిన అక్షయ్!

Akshay Kumar: వీడియో గేమ్ ఆడుతుండగా తన కూతురు నితారాకు ఎదురైన షాకింగ్ ఘటనను అక్షయ్ కుమార్ వెల్లడించారు. సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు ముంబై (Mumbai)లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) పాల్గొన్నారు. ఈ వేదికపై తన కూతురు నితారా (Akshay Kumar Daughter Nitara)కు ఎదురైన ఒక షాకింగ్ సంఘటనను పంచుకున్నారు. పెరుగుతున్న సైబర్ నేరాల (cybercrime) ముప్పు గురించి ఆయన గట్టిగా హెచ్చరించారు. తన కుమార్తె విషయంలో జరిగిన ఘటనతో.. పాఠశాలల్లో ‘సైబర్ పీరియడ్’ (cyber period) ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అసలింతకీ తన కుమార్తెకు ఎదురైన షాకింగ్ ఘటన ఏమిటంటే..

Also Read- Bomb Threat: మీ ఇంటిలో బాంబు పెట్టాం.. త్రిషతో పాటు ప్రముఖులకు చెన్నైలో బాంబు బెదిరింపుల కలకలం!

నితారాకు ఎదురైన చేదు అనుభవం

కొన్ని నెలల క్రితం తన ఇంట్లో జరిగిన సంఘటనను వివరిస్తూ అక్షయ్ కుమార్ ఇలా అన్నారు.. ‘‘నా కూతురు ఒక వీడియో గేమ్ ఆడుతోంది. కొన్ని వీడియో గేమ్‌లలో మీరు తెలియని వ్యక్తులతో (strangers) ఆడే అవకాశం ఉంటుంది. ఆడుతున్న సమయంలో, అపరిచితుల నుంచి సాధారణంగా ‘మీరు ఎలా ఉన్నారు?’ లేదంటే ‘మీరు ఎక్కడ నుంచి వచ్చారు?’ వంటి సందేశాలు వస్తాయి. అటువంటి సందేశాలలో భాగంగా, అకస్మాత్తుగా ఆమెకు ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే.. ‘మీరు మగవారా లేక ఆడవారా?’ అని మెసేజ్. దానికి ఆమె ‘ఆడపిల్లని’ అని సమాధానం ఇచ్చింది. ఆ వెంటనే, ‘మీ నగ్న చిత్రాలను పంపగలరా?’ అనే మెసేజ్ వచ్చింది. ఇది నా కూతురు నితారాకే జరిగింది. ఈ మెసేజ్ చూడగానే నితారా వెంటనే ఆ గేమ్ ప్లేను ఆపేసి, జరిగిన విషయాన్ని తన తల్లి ట్వింకిల్ ఖన్నాకు చెప్పింది’’ అని అక్షయ్ తెలిపారు.

Also Read- Putin on PM Modi: మోదీతో పెట్టుకోవద్దు.. భారత్ ఎప్పటికీ తలవంచదు.. ట్రంప్‌కు పుతిన్ వార్నింగ్

పాఠశాలల్లో ‘సైబర్ పీరియడ్’ కోసం విజ్ఞప్తి

ఇటువంటి ఘటనలే సైబర్ నేరాలకు నాంది పలుకుతాయని అక్షయ్ కుమార్ అన్నారు. దొంగతనాలు, దోపిడీల కంటే సైబర్ నేరాలు చాలా వేగంగా పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేరాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతూ, ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ‘‘మహారాష్ట్ర రాష్ట్రంలోని 7వ, 8వ, 9వ, 10వ తరగతి విద్యార్థులకు వారంలో ఒక పీరియడ్‌ను ‘సైబర్ పీరియడ్’ అని కేటాయించాలి. పిల్లలకు సైబర్ భద్రత గురించి వివరించడం చాలా అవసరం’’ అని అన్నారు. ఈ విధంగా, పిల్లలు ఆన్‌లైన్ ప్రపంచంలో ఎదురయ్యే ప్రమాదాలు, బెదిరింపుల గురించి ముందస్తుగా తెలుసుకొని, సురక్షితంగా ఉండగలుగుతారని ఆయన సూచించారు. అక్షయ్ కుమార్ చేసిన ఈ సూచనపై ఒక్క మహారాష్ట్ర అనే కాదు, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో కూడా ఇలాంటిది అవసరం అని నెటిజన్లు ఆయనను సమర్థిస్తున్నారు. చాలా మంచి సూచన అంటూ ధన్యవాదాలు చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?