Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో రాత్రి దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురు ను నేలకేసి కొట్టి చంపిన ఘటన కలకలం రేగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… సూర్యాపేట (Suryapet) జిల్లాలోని అర్వపల్లి మండలం కొత్తగూడ గ్రామపంచాయతీకి చెందిన వెంకటేష్.. నాగమణి దంపతులు కొంతకాలంగా జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా ఇటీవలనే భార్యాభర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సొంత గ్రామం కొత్తగూడెంలో వ్యవసాయ పనులు చేసుకుని వస్తు వెంకటేష్ మద్యం సేవించాడు. రాత్రి సమయంలో భర్త వెంకటేష్ మద్యం తాగి రావడంతో భార్య నాగమణి మందలించింది.
Also Read: Huzurabad: అంగన్‌వాడీ గుడ్లతో.. మందుబాబులకు స్నాక్స్.. వామ్మో ఇలా ఉన్నారేంట్రా!
తల్లి అరవడంతో చిన్నారి భవిజ్ఞ నిద్ర లేచి ఏడ్చింది.
దీంతో కొద్దిసేపు ఘర్షణ అనంతరం భార్యాభర్తలు, చిన్నారి భవిజ్ఞతోపాటు నిద్రకు ఉపక్రమించారు. ఈ సమయంలోనే భర్త వెంకటేష్ భార్య నాగమణి చేయిని కొరికాడు. దీంతో నాగమణి గట్టిగా అరిచింది. తల్లి అరవడంతో చిన్నారి భవిజ్ఞ నిద్ర లేచి ఏడ్చింది. దీంతో తండ్రి వెంకటేష్ ఏడుస్తున్న ఆ చిన్నారి నోరు గట్టిగా మూశాడు. ఇది గమనించిన తల్లి నాగమణి చిన్నారి మూతి దగ్గర పెట్టిన భర్త చేయి తీసే ప్రయత్నం చేసింది. ప్రతిస్పందించిన భర్త వెంకటేష్ భార్య నాగమణిని గట్టిగా నెట్టేశాడు. ఆ తర్వాత చిన్నారి రెండు కాళ్లు బట్టి నేలకు రెండుసార్లు కొట్టాడు.
చిన్నారికి కృత్రిమ శ్వాస అందించేందుకు ప్రయత్నం
పరిస్థితిని గమనించిన తల్లి నాగమణి చిన్నారి భవిజ్ఞను చూసేసరికి స్పృహ కోల్పోయింది. వెంటనే సమీప బంధువులకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజెప్పి చిన్నారిని సూర్యాపేట (Suryapet)లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, కొన ఊపిరితో ఉన్న చిన్నారికి కృత్రిమ శ్వాస అందించేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చిన్నారి తలకు బలమైన దెబ్బ తగలడంతో మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులంతా బోరుమని నిలపించారు. పారిపోయిన తండ్రి వెంకటేష్ ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి సూర్యాపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Manipur attack: జవాన్ల ట్రక్కుపై సాయుధుల దాడి.. ఇద్దరు అస్సాం రైపిల్స్ జవాన్లు కన్నుమూత