india-vs-oman
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

India vs Oman: ఒమన్‌పై టాస్ గెలిచిన టీమిండియా… ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

India vs Oman: ఆసియా కప్‌-2025లో మరో కీలక పోరుకు తెరలేచింది. లీగ్ దశలో భాగంగా భారత్-ఒమన్ జట్ల (India vs Oman) మధ్య మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి ఒమన్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించాడు.

Read Also- Gadwal District: గద్వాలలో చెలరేగిపోతున్న ఆకతాయిలు.. పోలీసులను సైతం లెక్కచేయని రౌడీ మూకలు

డెప్త్ అర్థం చేసుకుంటాం: సూర్యకుమార్ యాదవ్

‘‘మేము ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ టోర్నమెంట్‌లో మేము ఇప్పటివరకు ఫస్ట్ బ్యాటింగ్ చేయలేదు. కాబట్టి, మా బ్యాటింగ్ డెప్త్‌ను అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. సూపర్-4 మ్యాచ్‌లకు ముందు మ్యాచ్‌లను ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. మొదటి రెండు మ్యాచ్‌ల్లో మేము అనుసరించిన వాటినే కొనసాగించాలనుకుంటున్నాం. పిచ్ బాగానే కనిపిస్తోంది. మా ఓపెనర్లు చక్కగా రాణిస్తారని అంచనా వేస్తున్నాం. మేము రెండు మార్పులు చేశాం. హర్షిత్ రాణా జట్టులోకి వచ్చాడు’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

బ్యాటింగ్ చేసేవాళ్లం: జతీందర్ సింగ్

‘‘మేము టాస్ గెలిచివుంటే బాటింగ్ చేసేవాళ్లం. ఈ మ్యాచ్ ద్వారా చక్కటి అనుభవాన్ని పొందాలనుకుంటున్నాం. మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. జట్టు అంత బలహీనంగా లేదు. కానీ, ఇలాంటి మ్యాచ్‌లు ఆటగాళ్లను పరీక్షించుకునేందుకు మంచి అవకాశంగా మారతాయి. భారత జట్టుతో కూడా అదే గ్రౌండ్‌లో ఆడే అవకాశం రావడం గొప్ప విషయం. మా జట్టులో రెండు మార్పులు చేశాం’’ అని జతీందర్ సింగ్ చెప్పాడు.

తుది జట్లు..


భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజూ సాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.

ఒమన్: అమీర్ కలీం, జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మిర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), షా ఫైసల్, జిక్రియా ఇస్లాం, ఆర్యన్ బిష్ట్, మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితిన్ రమణండి.

Just In

01

Chikiri song out: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి ‘చికిరి’ సాంగ్ వచ్చేసింది..

Dharmapuri Arvind: నిజామాబాద్‌లో పొలిటికల్ లీడర్ల పేకాట అడ్డాలు.. వార్నింగ్ ఇచ్చిన ఎంపి అరవింద్

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్?

GHMC: అంతా మీ ఇష్టమా.. మా అనుమతులు తీసుకోరా.. జలమండలిపై జీహెచ్ఎంసీ గరం గరం

Recharge Plans: మొబైల్ వినియోగదారులకు షాక్‌.. మళ్ళీ పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ ధరలు..