Student Indiscipline: నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. పిల్లల మానసిక ఎదుగుదల, విద్యా నైపుణ్యాలు, సమాజం పట్ల ఎరుక ఇలాంటివన్నీ తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటాయి. మొక్కై వంగనిది మానై వంగునా? అనే నానుడిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల పట్ల తప్పక పాటిస్తారు. కానీ ప్రస్తుతం సమాజంలో పిల్లలు తప్పు చేస్తే తిట్టలేని, కొట్టలేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాని దుస్థితి. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్ లో గల ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో చదువుతున్న కొంతమంది విద్యార్థుల అల్లరి (Student Indiscipline) మితిమీరిపోయింది. ఏకంగా పాఠశాలలకు ఫంగనామాలు కొట్టి గుంపులు గుంపులుగా భీంనగర్ లోని రెవెన్యూ కాలనీ, కృష్ణవేణి జూనియర్ కాలేజ్ లేన్, రెడ్డి హాస్టల్ లేన్ లో తిరుగుతూ ఈలలు వేస్తూ, అల్లరిచేష్టలకు పాల్పడుతున్నారు.
Also Read: Gadwal Collectorate: గద్వాల ప్రజాపాలన వేదికపై ఉద్రిక్తత.. గ్రంథాలయ చైర్మన్ ఆవేశం
ద్వి చక్ర వాహనాల ప్లగ్ లు పీకేయడం
రాళ్లు విసరటం, బయట పడేసిన చెత్తను ఇళ్లలోకి వేయడం, ఇంటి ముందు వున్న ద్వి చక్ర వాహనాల ప్లగ్ లు పీకేయడం, సీట్ కవర్లు చించడం, ఇళ్ల ముందు కేరింతలు కొట్టడం,ఇళ్ల ముందు వున్న జామ చెట్లకు జామ పండ్లు ఎత్తుకెళ్లడం, వాళ్ళు వాళ్ళే కొట్టుకోవడంతో విసుగెత్తిన కాలనీ వాసులు పలు మార్లు ఉపాధ్యాయులు దృష్టికి తీసుకెళ్లారు. వీరి వెక్కిలి చేష్టలకు భీంనగర్ లో ఉన్న గర్ల్స్ హాస్టల్ విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్కూల్ కు డుమ్మాకొట్టి బయట తిరుగుతున్న విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని లేని పక్షంలో స్కూల్ నుంచి సస్పెండ్ చేయాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు. చదువుకుమే వయస్సులో స్కూల్ కు డుమ్మా కొట్టి ఇలా ఆకతాయిలుగా తిరిగితే వారి భవిష్యత్ నాశనం అయ్యే ప్రమాదం ఉందని మేధావులు పేర్కొంటున్నారు.
కౌన్సెలింగ్ ఇస్తే మంచి ఫలితాలు
స్కూల్‌కు డుమ్మాలు కొట్టి అల్లరి చేష్టలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. గత కొంతకాలంగా విద్యార్థుల చేష్టలు పెరుగుతూ వస్తున్నాయి. నియంత్రణ లేకపోవడంతో జరగకూడని ఘటనలు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెడ్డ పేరు రాకముందే మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అటువంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తే అదుపులో ఉండే అవకాశం ఉందని ఆభిప్రాయ పడుతున్నారు.
విద్యార్థుల పట్ల శ్రద్ధ వహిస్తే వారు ఉన్నత శిఖరాలను చేరుకుంటారు: సామాజికవేత్త సుదర్శన్ బడికిరాని పిల్లలను విద్యార్థులను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పేరేంట్ మీటింగ్ నిర్వహించి అవగహాన కల్పించాలి. డుమ్మాలు కొడుతున్న విద్యార్థులను పాఠశాలలకు తీసుకొని పోయి చదువుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో వారికి అవగాహన కల్పిస్తూ చదువు పట్ల ఆసక్తిని పెంచాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల శ్రద్ధ వహిస్తే వారు ఉన్నత శిఖరాలను చేరుకుంటారు.
స్కూల్‌కు రాని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తాం: వెంకటనర్సయ్య, ప్రధానోపాద్యాయుడు ప్రాక్టిసింగ్ హై స్కూల్
స్కూల్ కు డుమ్మా కొడుతున్న విద్యార్థులను గుర్తించాం. భీంనగర్‌లో పలు కాలనీలో విద్యార్థులు చేష్ఠలు చేస్తున్నారని మా దృష్టికి రావడం జరిగింది. తరగతి గదులకు హాజరు కాని విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.ఇక ముందు స్కూల్ పరిసరాలలో ఏ ఒక్క విద్యార్థి బయట తిరిగిన చర్యలు తీసుకుంటాం.
Also Read: Ramachandra Naik: ఇందిరమ్మ ఇండ్లు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాం.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు