Gadwal Collectorate: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లోని కలెక్టర్ కార్యాలయం (Gadwal Collectorate) లో జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో వేదిక పైకి తనను పిలువలేదని జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ నీలి శ్రీనివాసులు వేదిక పైన వున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, ఢిల్లీ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి ఏ పి జితేందర్ రెడ్డి తో పాటు, జిల్లా అధికారులతో వాగ్వాదానికి దిగారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తుండగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జితేందర్ రెడ్డి హాజరై పతాఆవిష్కరణ చేశారు.
Also Read: SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!
అనంతరం సభనుద్దేశించి ప్రసంగించారు. సంస్కృత కార్యక్రమాలు ప్రారంభం కాగా వేదిక పైకి జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ ఐనా నాకు వేదిక పైకి ఆహ్వానంచకుండా అవమానించారని, గద్వాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ను వేదిక పైకి ఆహ్వానించి జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ ను కావాలని అవమానించడం సరైనది కాదంటూ జిల్లా అధికారులు, ముఖ్య అతిధితో వాగ్వాదానికి దిగారు. వెంటనే పోలీస్ లు అప్రమతమై నీలి శ్రీను ను పక్కకు లాకెళ్లారు. కొద్దీ సేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది .
గత కార్యక్రమాలలోనూ..
కాంగ్రెస్ ప్రభుత్వంలో జోగులాంబ గద్వాల జిల్లా గ్రంధాల చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నీలి శ్రీను అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ ప్రకారం పాల్గొనేందుకు వెళ్లినా వేదికపైకి ఆహ్వానించకపోవడంతో సంబంధిత అధికారులతో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. సంపత్ కుమార్ అనుచరుడిగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేందుకు చైర్మన్ చొరవ చూపుతుంటారు. జిల్లా గ్రంధాలయంతో పాటు మండల కేంద్రాలలో పాఠకుల అభిరుచికి తగ్గట్లు, ప్రస్తుత కాంపిటేషన్ బుక్స్ ను అందుబాటులో ఉంచి మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు.
Also Read: Osmania Medical College: అత్యాధునికంగా ఉస్మానియా దవాఖాన.. మారనున్న రూపురేఖలు!