Osmania Medical College: దేశంలోని ఏ మెడికల్ కాలేజీకీ లేని ప్రత్యేకత ఉస్మానియా మెడికల్ కాలేజీ(Osmania Medical College)కి ఉన్నదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) అన్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒకటి లేదా రెండు హాస్పిటళ్లు మాత్రమే ఉంటాయని, కానీ, ఉస్మానియా కాలేజీకి మాత్రం 10 అనుబంధ హాస్పిటళ్లు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఉస్మానియా హాస్పిటల్‌తో పాటు, నీలోఫర్ హాస్పిటల్, సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్, టీబీ అండ్ చెస్ట్ హాస్పిటల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్, పెట్లబుర్జు మెటర్నిటీ హాస్పిటల్, ఈఎన్‌టీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్ అనుబంధంగా ఉన్నాయన్నారు. ఒకప్పుడు ఆంధ్ర(AP), తెలంగాణ(Telangana), కర్ణాటక(Karnataka) ప్రాంత పేషెంట్ల ప్రాణాలను ఈ హాస్పిటళ్లే నిలిపాయని మంత్రి గుర్తు చేశారు.
పూర్వవైభవం తీసుకొద్దాం
5 వేలకుపైగా బెడ్లతో, ఒక్కో హాస్పిటల్ ఒక్కో స్పెషాలిటీలో లక్షల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు. వివిధ ప్రత్యేకతలతో ఎంతో ముందు చూపుతో ఏర్పాటైన ఈ హాస్పిటళ్లకు, పూర్వవైభవం తీసుకొద్దామని.. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ మేరకు ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటళ్ల పనితీరు, ఆయా హాస్పిటళ్లలో అత్యాధునిక వసతుల కల్పన, తదితర అంశాలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, అన్ని హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఆయా హాస్పిటళ్ల పనితీరు, పేషెంట్లకు అందిస్తున్న సేవలు, సాధించిన విజయాలు, సమస్యలపై అధికారులు మంత్రికి వివరించారు.
Also Read: Beauty Movie: మొన్న తండ్రీకూతుళ్లుగా.. నేడు భార్యాభర్తలుగా.. నటించిన నటులెవరో తెలుసా?
అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉస్మానియాకు అనుబంధంగా ఉన్న ఒక్కో హాస్పిటల్‌కు వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందన్నారు. ఒకప్పుడు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రాంత పేషెంట్ల ప్రాణాలను ఈ హాస్పిటళ్లే నిలిపాయని మంత్రి గుర్తు చేశారు. గత వైభవాన్ని పునరుద్ధరించేందుకు, ఇప్పటి అవసరాలకు అనుగుణంగా హాస్పిటళ్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. హాస్పిటళ్లను ఆధునీకరించడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్‌కు మంత్రి సూచించారు. ఈఎన్‌టీ(ENT) హాస్పిటల్ కోసం కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన సమస్యలు, ఉస్మానియా డెంటల్ కాలేజీకి సంబంధించిన భూమి సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలన్ని మంత్రి ఆదేశించారు .అన్ని హాస్పిటళ్లను నేరుగా విజిట్ చేస్తానని, పేషెంట్లకు అందుతున్న సేవలపై నేరుగా వారితోనే మాట్లాడుతానని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి తెలిపారు.
Also Read: MLA Yashaswini Reddy: తండా వాసుల కల నెరవేర్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి