Train Cancellations: పలు రైళ్లు రద్దు, మరికొన్ని రీషెడ్యూల్
Railway-News
Viral News, లేటెస్ట్ న్యూస్

Train Cancellations: పలు రైళ్లు రద్దు, మరికొన్ని రీషెడ్యూల్.. లిస్ట్‌లో సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైలు కూడా..

Train Cancellations: రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) కీలక సమాచారం ఇచ్చింది. జాజ్‌పూర్ కేయోన్‌ఝార్ రోడ్, భద్రక్ సెక్షన్‌ల మధ్య రైల్వే భద్రతకు సంబంధిత ఆధునికీకరణ పనులు జరుగుతున్నందున పలు రైలు సర్వీసుల్లో తాత్కాలిక మార్పులు (Train Cancellations) చేస్తున్నట్టుగా సోమవారం వెల్లడించింది. ఈ మార్పులు సెప్టెంబర్ 16 (మంగళవారం) నుంచి సెప్టెంబర్ 22 (సోమవారం) వరకు అమలులో ఉంటాయని తెలిపింది. రద్దు చేస్తున్న రైళ్ల జాబితాలో పూరీ–జలేశ్వర్–పూరీ (MEMU) (68442/68441) ట్రైన్ ఉందని తెలిపింది. ఈ రైలు సెప్టెంబర్ 16, 19, 20, 22 తేదీలలో (సోమవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం) రద్దు చేస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే వివరించింది.

ప్రయాణ దూరం తగ్గించిన రైళ్లు ఇవే

రైళ్ల ప్రయాణ దూరాన్ని కుదిరించిన ట్రైన్స్ లిస్టులో భద్రక్ (MEMU) (68424) సర్వీసు ఉంది. సెప్టెంబర్ 17, 21 (మంగళ, శనివారం) తేదీలలో ఈ సర్వీసు జాజ్‌పూర్ కేయోన్‌ఝార్ రోడ్ స్టేషన్‌తో ముగుస్తుంది. ఇక, భద్రక్ – కటక్ MEMU (68423) రైలు అదే రోజున భద్రక్‌ స్టేషన్‌కు బదులుగా జాజ్‌పూర్ కేయోన్‌ఝార్ రోడ్ నుంచి ప్రారంభమవుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. మరోవైపు, కటక్ – భద్రక్ MEMU (68438) రైలు కూడా సెప్టెంబర్ 19, 22 (గురు, ఆదివారం) తేదీలలో జాజ్‌పూర్ కేయోన్‌ఝార్ రోడ్ వద్దే ముగుస్తుంది. లైన్ ఆధునికీకరణ పనుల దృష్ట్యా అక్కడితోనే నిలిపివేస్తున్నారు. ఇవే తేదీలలో భద్రక్ – కటక్ MEMU (68437) రైలు జాజ్‌పూర్ కేయోన్‌ఝార్ రోడ్ నుంచి మొదలవుతుంది.

Read Also- Shanmukh Jaswanth: యూట్యూబ్‌ ఫేం షణ్ముఖ్‌ జస్వంత్‌ ‘ప్రేమకు నమస్కారం’ టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్

రీషెడ్యూల్ చేసిన రైళ్లు లిస్ట్ ఇదే..

హౌరా–సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను (12703) సెప్టెంబర్ 17 (మంగళవారం), 21 (శనివారం) తేదీలలో 1 గంట 30 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రయాణించనుంది. ఈ మేరకు రైల్వే అధికారులు రీషెడ్యూల్ చేశారు. చెన్నై–హౌరా ఎక్స్‌ప్రెస్‌ను (12840) కూడా రీషెడ్యూల్ చేశారు. సెప్టెంబర్ 18 (బుధవారం), 21 (శనివారం) తేదీలలో 2 గంటల పాటు ఆలస్యంగా ప్రయాణించనుందని ప్రకటనలో తెలిపారు. పూరీ–జయనగర్ ఎక్స్‌ప్రెస్ (18419) సెప్టెంబర్ 19న (గురువారం) 1 గంట ఆలస్యంగా ప్రయాణిస్తుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వివరించారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణాన్ని తగినట్లుగా ప్లానింగ్ చేసుకోవాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) సూచించింది.

Read Also- POWERGRID Recruitment 2025: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో భారీ ఉద్యోగాలు..

కాగా, పూరీ నుంచి జలేశ్వర్ వరకు ప్రయాణించే రైళ్లు భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలసోర్ వంటి ప్రధాన నగరాల మీదుగా వెళ్తాయి. ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. పూరీ-జలేశ్వర్ ట్రైన్ ప్రయాణించే స్టేషన్లను పరిశీలిస్తే, పూరీ ప్రారంభ స్టేషన్‌గా ఉంటుంది. ఆ తర్వాత, సఖీ గోపాల్ (ఎస్ఐఎల్), డెలాంగ్ (డీఈడీ), కుంద్రా రోడ్ జంక్షన్ (ప్రధాన జంక్షన్), భువనేశ్వర్, కటక్, జైపూర్ కేయోఘర్ రోడ్, భద్రక్, బాలాసోర్, చివరి స్టేషన్‌గా జలేశ్వర్‌ ఉంది.

Read Also- Gowra Hari: మిరాయ్, హనుమాన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. బిజీగా మారనున్న గౌర హరి

Just In

01

Sarpanch Ceremony: నేడు సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం.. ముస్తాబైన పంచాయతీ ఆఫీసులు

Tanuja Puttaswamy: భావోద్వేగానికి లోనైన బిగ్ బాస్ రన్నర్ తనూజ .. ప్రేక్షకుల గురించి ఏం అన్నారంటే?

Bhatti Vikramarka: ఆర్టీసీలో మహాలక్ష్ముల ప్ర‌యాణానికి ప్రత్యేక కార్డులు..?

Uttam Kumar Reddy: ఇరిగేషన్ ప్రాజెక్టులను నాశనం చేసిందే కేసీఆర్: మంత్రి ఉత్తమ్ ఫైర్..!

Tamannaah Rejected: సినిమా కథ కోసం తమన్నాను రిజెక్ట్ చేసిన దర్శకుడు.. కారణం ఏంటంటే?