Shanmukh Jaswanth:
నటి నటులు: షణ్ముఖ్ జస్వంత్, శివాజీ, భూమిక, ఉల్కగుప్తా, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, అరుణ్ అదిత్, రంగస్థలం మహేష్, మణిచందన, కమల్, క్రాంతి, నీల రమణ, శోభన్, సుభాష్, కొటేశ్వరరావు
డీవోపీ కిషోర్ బోయిడపు.
సంగీతం: గ్యానీ, ఎడిటర్: కేసీబీ హరి.
లిరిక్స్: సరస్వతి పుత్రి రామజోగయ్య శాస్త్రి, దినేష్ కాకెర్ల.
ఆర్ట్: రవికుమార్.
కొరియోగ్రఫీ: శ్రావణ్, విశాల్.
ప్రొడక్షన్: రమేష్ వర్మ.
నిర్మాతలు: అనిల్ కుమార్ రావాడా, భార్గవ్ మన్నె.
రచన-దర్శకత్వం: భీమ శంకర్.
కొత్త కథతో వచ్చిన సినిమాలను మన తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు.. అలాగే సపోర్ట్ చేస్తారు కూడా. అందుకే మన దర్శక, నిర్మాతలు ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ మూవీలను నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో మంచి పేరు తెచ్చుకున్న వారు వెండి తెరకు పరిచయమవుతున్నారు.
Also Read: Tollywood Actress: కోటి ఆఫర్ చేశారు.. వాళ్ళతో నా బెడ్ షేర్ చేసుకోలేను.. ఆ షో పై నటి సంచలన కామెంట్స్
ఇటీవల లిటిల్‌హార్ట్స్ సినిమా యూట్యూబ్ సన్సేషన్, మీమ్ కంటెంట్ క్రియేటర్ మౌళి తనూజ్ పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు అదే దారిలో యూట్యూబ్‌లో వీడియోలతో మంచి పేరు తెచ్చుకున్న యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతుంది. ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ప్రముఖ నటుడు శివాజీ, ప్రముఖ నటి భూమిక కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ఏబీ సినిమాస్ పతాకంపై అనిల్ కుమార్ రావాడ, భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ సినిమాకి వి. భీమ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు హీరో షణ్ముఖ్ జస్వంత్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి ‘ప్రేమకు నమస్కారం’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసి, దీనికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read: Hyderabad Collector: సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి పెట్టాలి.. అధికారులకు కలెక్టర్ హరిచందన ఆదేశం!
ఈ వీడియో చూస్తుంటే.. ఇదొక యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తుంది. లవ్ ఫెయిల్యూర్స్.. లవ్ బ్రేకప్ అయిన వాళ్లంతా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్న సంభాషణలు.. వాళ్ల గర్లఫ్రెండ్స్ తమకు ఎలా హ్యాండ్ ఇచ్చారు అని చెప్పుకునే ఫన్నీ బాధలు అన్ని ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. ఇక ఫైనల్‌గా ఫణ్ముఖ్ ఇది పాన్ ఇండియా ప్రేమ ప్రాబ్లమ్ అని చెప్పడం, మీరు అమ్మాయి దక్కలేదని మందుకు, సిగరెట్లకు ఖర్చు పెట్టే డబ్బులతో కైలాసగరి దగ్గర ల్యాండ్‌తో పాటు కారు కూడా కొనుక్కోవచ్చు అని చెప్పే సంభాషణలు యూత్‌కు, వాళ్ల ప్రేమకు ఎంతో కనెక్ట్ అవుతాయి.టోటల్‌గా ప్రేమకు నమస్కారం అనే టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.