Diwali Special Trains (IMage Source: Twitter)
జాతీయం

Diwali Special Trains: దీపావళి స్పెషల్.. ఏకంగా 1,126 ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు పండగే!

Diwali Special Trains: ప్రయాణికులకు సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. రాబోయే దీపావళి, ఛఠ్ పూజా పండుగలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా 1,100కిపైగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. గతంలో ప్రకటించిన 944 ప్రత్యేక రైళ్లకు కొత్తగా 182 రైళ్లను జత చేస్తున్నట్లు తెలిపింది. ఫలితంగా పండుగల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైన్స్ సంఖ్య.. 1,126కు చేరినట్లు స్పష్టం చేసింది.

స్పెషల్ ట్రైన్స్ మార్గాలు..

ఈ ప్రత్యేక రైళ్లు ఎక్కువగా ముంబయి, పూణేల నుంచి నడవనున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ముంబయి – దానాపూర్ (Mumbai-Danapur), ముంబయి – బనారస్ (Mumbai-Banaras), ముంబయి – మౌ (Mumbai-Mau), ముంబయి – కరీంనగర్ (Mumbai-Karimnagar), పూణే – అమరావతి (Pune-Amravati), పూణే – సంగనేర్ (Pune-Sanganer) మధ్య అవి తిరగనున్నట్లు వెల్లడించింది. ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను సైతం సౌత్ సెంట్రల్ రైల్వే పంచుకుంది.

ముంబయి – దానాపూర్ (40 సర్వీసులు)

ట్రైన్ నెం. 01017: ముంబయి లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి ప్రతీ సోమవారం, శనివారం మధ్యాహ్నం 12.15కి బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 10.45కి దానాపూర్ (బిహార్ రాష్ట్రం) చేరుతుంది (20 సర్వీసులు).

ట్రైన్ నెం. 01018: దానాపూర్ నుంచి ప్రతీ సోమవారం, బుధవారం రాత్రి 12.30కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ముంబయి చేరుతుంది (20 సర్వీసులు).

ముంబయి – మౌ (40 సర్వీసులు)

01123: ముంబయి నుంచి ప్రతీ శుక్రవారం, ఆదివారం మధ్యాహ్నం 12.15కి బయలుదేరి మూడో రోజు ఉదయం 5.35కి మౌ చేరుతుంది (20 సర్వీసులు).

01124: మౌ నుంచి ప్రతీ ఆదివారం, మంగళవారం ఉదయం 7.35కి బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 10.20కి ముంబయి చేరుతుంది (20 సర్వీసులు).

ముంబయి – బనారస్ (40 సర్వీసులు)

01051: ముంబయి నుంచి బుధవారం, గురువారం మధ్యాహ్నం 12.15కి బయలుదేరి మూడో రోజు ఉదయం 1.10కి బనారస్ చేరుతుంది (20 సర్వీసులు).

01052: బనారస్ నుంచి శుక్రవారం, శనివారం ఉదయం 6.35కి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.40కి ముంబయి చేరుతుంది (20 సర్వీసులు).

ముంబయి – కరీంనగర్ (6 సర్వీసులు)

01067: ముంబయి నుంచి మంగళవారం మధ్యాహ్నం 3.30కి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30కి కరీంనగర్ చేరుతుంది (3 సర్వీసులు).

01068: కరీంనగర్ నుంచి బుధవారం సాయంత్రం 5.30కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.40కి ముంబయి చేరుతుంది (3 సర్వీసులు).

పూణే – అమరావతి (16 సర్వీసులు)

01403: పూణే నుంచి మంగళవారం రాత్రి 7.55కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.05కి అమరావతి చేరుతుంది (8 సర్వీసులు).

01404: అమరావతి నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 12.15కి పూణే చేరుతుంది (8 సర్వీసులు).

పూణే – సంగనేర్ జంక్షన్ (సూపర్ ఫాస్ట్) (14 సర్వీసులు)

01405: పూణే నుంచి శుక్రవారం ఉదయం 9.45కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కి సంగనేర్ చేరుతుంది (7 సర్వీసులు).

01406: సంగనేర్ నుంచి శనివారం ఉదయం 11.35కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30కి పూణే చేరుతుంది (7 సర్వీసులు).

పూణే – సంగనేర్ జంక్షన్ (26 సర్వీసులు)

01411: పూణే నుంచి గురువారం, ఆదివారం ఉదయం 9.45కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కి సంగనేర్ చేరుతుంది (13 సర్వీసులు).

01412: సంగనేర్ నుంచి శుక్రవారం, సోమవారం ఉదయం 11.35కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30కి పూణే చేరుతుంది (13 సర్వీసులు).

Also Read: IMD Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్.. వర్షాలతో దబిడి దిబిడే.. ఐఎండీ స్ట్రాంగ్ వార్నింగ్!

టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?

సెంట్రల్‌ మధ్య రైల్వే ప్రకారం.. ఈ ప్రత్యేక రైళ్ల టికెట్ల బుకింగ్‌ సెప్టెంబర్‌ 14 నుంచే ప్రారంభమైంది. అన్ని కంప్యూటరైజ్డ్‌ రిజర్వేషన్‌ కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. IRCTC వెబ్‌సైట్‌ www.irctc.co.in లో కూడా ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేయవచ్చు. రిజర్వేషన్‌ లేని కోచ్‌ల కోసం టికెట్లు UTS యాప్/సిస్టమ్‌ ద్వారా అందుబాటులో ఉంటాయి. వీటికి సాధారణ మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల అన్ రిజర్వ్డ్ ఛార్జీలు వర్తిస్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి.

Also Read: Dussehra 2025: రాంచీలో అద్భుతం.. తిరుమల థీమ్‌తో దుర్గా దేవీ మండపం.. భక్తులకు గూస్ బంప్స్ పక్కా!

Just In

01

Konda Reddy Arrest Case: వైసీపీ విద్యార్థి నేత అరెస్టుపై ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు సంధించిన గుడివాడ అమర్నాథ్

Rashmika Mandanna: నన్ను కలవాలంటే ‘రౌడీ జిమ్’కు వచ్చేయండి.. నేనే ట్రైన్ చేస్తా!

Etela Rajender: ముఖ్యమంత్రులేం ఓనర్లు కాదు.. ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్‌తో కదిలిన విద్యాశాఖ.. ఎమ్మెల్యే పీఏగా పనిచేస్తున్న ఇంగ్లిష్ టీచర్‌పై విచారణ షురూ

Chinmayi Sripada: మంగ‌ళ‌సూత్రం కాంట్రవర్సీ.. ట్రోలర్స్‌పై చిన్మ‌యి ఫిర్యాదు