IMD Weather Report: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ కేంద్రం (Indian Metrological Department) తాజాగా హెచ్చరించింది. తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వచ్చే ఐదు రోజులు ఈదురుగాలులతో కూడిన వాన పడొచ్చని అంచనా వేసింది. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాలకు సైతం వర్ష సూచన చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఉత్తరాది రాష్ట్రాలు..
అరుణాచల్ ప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు (సెప్టెంబర్ 16, 17, 18, 19) అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. అలాగే అసోం, మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 16-18 తేదీల మధ్య కుండపోత వాన కురిసే ఛాన్స్ ఉందని అభిప్రాయపడింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాల్లో ఇవాళ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Also Read: IND vs PAK: పాక్‌తో షేక్ హ్యాండ్ రగడ.. చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చిన బీసీసీఐ
ఏపీ, తెలంగాణకు వార్నింగ్
సౌత్ లోని తమిళనాడులో సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 19 వరకు పలు ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో వర్షాలు కురవొచ్చన ఐఎండీ వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడొచ్చని అంచనా వేసింది. అలాగే ఏపీలోని రాయలసీమ, తెలంగాణ స్టేట్ తో పాటు ఉత్తర కర్ణాటక ప్రాంతంలో 16, 17 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోస్టల్, దక్షిణ కర్ణాటకలో రేపు వానలు పడొచ్చని పేర్కొంది. ఇక ఏపీలోని తీర ప్రాంత జిల్లాలు, యానం, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వచ్చే 5 రోజులు గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. ఫలితంగా అక్కడక్కడ చినుకులు పడొచ్చని తెలిపింది.
Also Read: Dussehra 2025: రాంచీలో అద్భుతం.. తిరుమల థీమ్‌తో దుర్గా దేవీ మండపం.. భక్తులకు గూస్ బంప్స్ పక్కా!
గోవా, మహారాష్ట్రలోనూ వర్షాలు
తూర్పు, మధ్య భారత దేశంలోని రాష్ట్రాలకు సైతం ఐఎండీ వర్ష సూచన చేసింది. చత్తీస్ గఢ్ లోని విదర్భ, బెంగాల్ లోని గాంగిటెక్ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షం కురుస్తుందని చెప్పింది. అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో 17-20 తేదీల్లో, ఝార్ఘండ్ లో 16-18 తేదీల్లో, బిహార్ రాష్ట్రంలో 16-19 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే పశ్చిమ భారత్ లోని గోవా, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో 16-18 తేదీల మధ్య అతి పెద్ద ఎత్తున వర్షం కురుస్తుందని చెప్పింది.