Hyderabad Collector ( IMAGE credit: swetcha reporter)
హైదరాబాద్

Hyderabad Collector: సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి పెట్టాలి.. అధికారులకు కలెక్టర్ హరిచందన ఆదేశం!

Hyderabad Collector: జిల్లాలో వర్షాలు అధికంగా కురుస్తున్నందున సీజనల్ వ్యాధుల నివారణపై ఎక్కువగా దృష్టి పెట్టాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి (Harichandana Dasari) అధికారులను ఆదేశించారు.  కలెక్టర్ గోల్కొండ ఏరియా ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మోహివుద్దీన్ తో కలిసి విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఔట్ పేషంట్ బిల్డింగ్ నిర్మాణానికి నిధులు కేటాయించడంతో టెండర్ ప్రక్రియ తదితర అంశాలపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 Also Read: Maruti Victoris: సరికొత్త కారును ఆవిష్కరించిన మారుతీ సుజుకీ… ధర, ఇతర వివరాలు ఇవే

ఆసుపత్రి భవనంలోనే ఉన్న యూపీహెచ్ సీ సెంటర్

అలాగే ఆసుపత్రిలోని ఓపీ సేవలు, ప్రసూతి సేవలు, మందుల నిల్వలు, సీజనల్ వ్యాధులపై వచ్చే రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఆసుపత్రి భవనంలోనే ఉన్న యూపీహెచ్ సీ సెంటర్ ను మార్చే అంశంపై కలెక్టర్ ఎమ్మెల్యేకు వివరించారు. యూపీహెచ్ సీ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించాలని స్థానిక తహశీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు. ఆ తర్వాత సెకండ్ లాన్సర్ రీసాల బజార్ లో గల జీజీహెచ్ ఎస్ పాఠశాలను పరిశీలించి, ఇటీవల కురిసిన వర్షాలతో పడిపోయిన కాంపౌండ్ వాల్ ను పరిశీలించారు.

అలాగే జీజేఆర్ ప్రభుత్వ జూనియర్ డిగ్రీ మహిళా కళాశాలను సందర్శించి విద్యార్థుల సంఖ్య, అందుతున్న సదుపాయాలు, విద్యా బోధన తీరు , ఉత్తీర్ణత శాతం తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. పాత పోలీస్ క్వాటర్స్ ను పరిశీలించారు. డిగ్రీ కళాశాలను పాత పోలీస్ క్వాటర్స్ లో నిర్మించేందుకు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి స్థలాన్ని కేటాయించేలా చూడాలని ఎమ్మెల్యే కలెక్టర్ ను కోరారు. ఈ విజిట్ లో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, తహశీల్దార్ అహల్య, కళాశాల ప్రిన్సిపాల్ టి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 Also Read: US Corn Threat: మరోసారి అమెరికా బెదిరింపులు.. భారత్ మా మొక్కజొన్న కొనకుంటే…

ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబం ను విజయవంతం చేయాలి..  జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఆదేశం

హైదరాబాద్ జిల్లాలో ఈ నెల 17 నుండి వచ్చే నెల 2 వ తేదీ వరకు నిర్వహించనున్న ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబం ( స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి, సెక్రెటరీ డాక్టర్ అశోక్ కుమార్ లతో కలసి ఆమె పాల్గొన్నారు.

ప్రతిరోజు ఒక స్పెషాలిటీ క్యాంపు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్యాంపుల నిర్వహణ షెడ్యూల్ ను సిద్ధం చేసి, ప్రణాళిక ప్రకారం ప్రతిరోజు ఒక స్పెషాలిటీ క్యాంపు, ఒక మెగా క్యాంపు నిర్వహించాలని ఆమె వైద్యాధికారులకు సూచించారు. అలాగే ఈ క్యాంపుల నిర్వహణలో 14 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలని, ప్రజల భాగస్వామ్యంతో కలిసి పని చేయాలని ఆమె సూచించారు. ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు పని దినాల్లో 12 రోజులు ప్రతి యూపీహెచ్ సీ లలో స్పెషలిస్ట్ క్యాంపులు నిర్వహించాలని ఆమె సూచించారు.

మెరుగైన వైద్య సేవలు అందాలి

అదే విధంగా యూపీహెచ్ సీలలో గైనకాలజీ సర్వీసెస్, పిడియాట్రిక్ సర్వీసెస్, ఈఎన్ టీ, డెంటల్, టీబీ, డెర్మటాలజీ, న్యూట్రిషన్, సైక్రో యాట్రిస్ట్, అప్తాలామిక్ తదితర మెరుగైన వైద్య సేవలు అందాలని ఆమె సూచించారు. అలాగే వచ్చే 17న తేదీన ముందుగా క్యాంపును అమీర్ పేటలో మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ ఓ డాక్టర్ వెంకటి, డీటీసీఓ డాక్టర్ చల్లా దేవి, ఇంచార్జ్ డీసీహెచ్ ఎస్ శ్రీనివాసరావు, గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమ అధికారులు, వివిధ విభాగాల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Land Grabbing Case: హైకోర్టు న్యాయవాది ఇంటిని కబ్జా చేయాలనే కుట్ర.. నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్!

Just In

01

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?