Land Grabbing Case: దుగినేపల్లి గ్రామానికి చెందిన శనగల పవన్ కుమార్,భోగటి రమాదేవి అనే భార్య భర్తలకు ఇద్దరికి జ్యూడిషల్ కోర్ట్ గత రిమాండ్ విధించింది. దీనితో వీరిని పోలీసులు ఆదివారం భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. వివరలోకి వెళితే…మండలంలో ని ఏడుల్ల బయ్యారం క్రాస్ రోడ్ కి సంబందించిన హైకోర్ట్ న్యాయవాది ఎన్. మణిదీప్ ఇంటిని అక్రమ పద్ధతుల ద్వారా ముందస్తు పక్కా స్కెచ్ తో స్థానికంగా ఉండే కొంతమంది వ్యాపార సంఘ వ్యక్తులతో కలసి కబ్జా చేయాలని నిందితులు కుట్ర పన్నారు. ముందస్తుగా అద్దె పేరుతో ఇంట్లోకి ప్రవేశించి ఆపై అదే ఇంట్లో దొంగతనం చేసారు. పూర్తిగా ఈకుట్ర స్థానికంగా ఉండే ఓ వ్యాపార సంఘంలోని కొంతమంది వ్యక్తులు నిందితుల ఇద్దరికీ పూర్తి సహకారాలు అందచేసి మరింత ప్రోత్సహం అందించారని తెలుస్తుంది.
Also Read: Viral Video: ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. కోర్టు ఆవరణలోనే చెప్పుతో కొట్టిన భార్య.. వీడియో వైరల్
నిందితులపై చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ అధికారులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కూడా సమూహంగా వచ్చి వారి విధులకు సైతం తీవ్ర ఆటకం కలగ చేసారు. ఈ కేసు పూర్వఫలాలు పరిశీలించి తెలంగాణ హైకోర్టు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తూ నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.కోర్ట్ ఆదేశాలు అనుసరించి విధులు నిర్వర్తిస్తున్న అధికారులుపై నిందితులు దాడికి యత్నించి బెదిరింపులు గురి చేసారు. నిందితులు గతంలోనే అక్రమ నాటు సారా కేసులో జైలుకి వెళ్లారు.అధికారుల ఆటకం చేసినందుకు,దొంగతనం చేసినందుకు అనేక కేసులు వీరిపై నమోదు అయ్యాయి.ముందస్తు గా అద్దె పేరుతో ఇంట్లోకి ప్రవేశించి,ఇంట్లో దొంగతనానికి పాల్పడి, ఇల్లు మొత్తం కబ్జాకి యత్నించారు.
ఇసుక ర్యాంపు అనుమతులు అక్రమ పద్ధతులు
అయితే కొందరు వ్యక్తులు ఓ సంగం అనే పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, కొన్ని నెలలు ముందస్తు గానే కుట్ర చేసి వచ్చారని ఈ కేసులో పిటిషనర్ లు తెలిపారు. మసాయిని సత్యనారాయణ అనే వ్యక్తి, ప్రస్తుత ఇంటి ఓనర్ ఎన్.రమాదేవి అనుమతి లేకుండా ఇసుక ర్యాంపు అనుమతులు అక్రమ పద్ధతుల ద్వారగా తీసుకోవడంపై హైకోర్ట్ లో కేసు వేశారని, బదీనిని మనసులో పెట్టుకుని, సత్యనారాయణ తన దుగినేపల్లిలో ఇంటి లో అద్దెకు ఉన్న ఈ నిందితులను అక్కడ నుండి ఖాళీ చేపించి, వీరిని ఎన్ రమాదేవి,వారి కుమారుడు ఎన్.మణిదీప్ అడ్వకేట్ ఇంటిలోకి కబ్జాకు పంపారని తెలుస్తుంది.ఓ వ్యాపార సంఘంలో ఉన్న వ్యక్తులు గంజాయి మురళి, భాస్కర్ రెడ్డి,నిమ్మల వెంకన్న మరికొందరిని ముందు ఉండి, అధికారులను సైతం విధులు నిర్వహించకుండా అడ్డుపడి, నిందితులకు ప్రోత్సహం ఇచ్చారని ఈ కేసులో ఉన్న పిటిషనర్ తెలిపారు.కుట్ర కోణంలో జరిగిన ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ జలపాల్సిందిగా పిటిషన్ర్లు కోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకువెళ్లారు.