Hyderabad Deer Meat (imagecredit:twitter)
హైదరాబాద్

Hyderabad Deer Meat: టోలీచౌకీలో జింక మాంసం.. కొమ్ములు సీజ్ చేసిన అధికారులు

Hyderabad Deer Meat: విశ్వసనీయ సమాచారం మేరకు టోలీచౌకీ పోలీసులు(Tolichawki Police) ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి 10 కిలోల జింక మాంసం(Venison), మూడు కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు వేటకు ఉపయోగించిన డబుల్ బోర్ గన్​ తోపాటు మరో మూడు ఆయుధాలను కూడా కూడా సీజ్​ చేశారు. సౌత్​ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్(DCP Chandramohan)​ మీడియా సమావేశంలో ఏసీపీ సయ్యద్​ ఫయాజ్(ACP Syed Fayaz) తో కలిసి వివరాలు వెల్లడించారు. టోలీచౌకీ సబ్జా కాలనీలోని మావిన్ క్లాసిక్ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్నమహ్మద్​ సలీం మూసా (47) వృత్తిరీత్యా డాక్టర్, సంజీవరెడ్డినగర్​ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు.

అడవులకు వెళ్లి ఓ జింకను వేటాడి..

నాంపల్లి బజార్​ ఘాట్ ప్రాంత వాస్తవ్యుడు, రియల్టర్ అయిన మహ్మద్ ఇక్భాల్ అలీ (48) అతని స్నేహితుడు. ఈ ఇద్దరు తమను తాము క్రీడాకారులుగా చెప్పుకొని 2014లో గన్ లైసెన్సులు తీసుకున్నారు. ఆ తరువాత ఓ డబుల్​ బోర్ గన్​ తోపాటు మరో మూడు ఆయుధాలను కొన్నారు. అయితే, వీటిని ఆటకు కాకుండా వన్యప్రాణుల వేటకు ఉపయోగించటం మొదలు పెట్టారు. ఇటీవల జహీరాబాద్ ప్రాంతంలోని అడవులకు వెళ్లి ఓ జింకను వేటాడి చంపారు. అనంతరం దాని మాంసం, కొమ్ములు తీసుకుని హైదరాబాద్ వచ్చారు. కాగా, డాక్టర్ మహ్మద్​ సలీం మూసా ఇంట్లో జింక మాంసంతోపాటు కొమ్ములు ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది.

Also Read: Crime News: పట్టపగలే శంకర్ పల్లిలో దారి దోపిడీ.. మధ్యలో కారు ప్రమాదం.. చివరికి..?

విచారణలో వెల్లడైన వివరాలు

ఈ క్రమంలో టోలీచౌకీ సీఐ రమేశ్ నాయక్​ సిబ్బందితో కలిసి మావిన్ క్లాసిక్ అపార్ట్ మెంట్​ కు వెళ్లారు. వీరిని చూసిన మహ్మద్ సలీం మూసా(Mohammed Salim Musa) తన ఇంట్లోని జింక మాంసం, కొమ్ములను బోలెరో వాహనంలో అక్కడి నుంచి తరలించే యత్నం చేశాడు. అయితే, అలర్ట్ గా ఉన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెల్లడైన వివరాల మేరకు మహ్మద్​ ఇక్భాల్ అలీ(Muhammad Iqbal Ali)ని కూడా అరెస్ట్ చేశారు. నిందితులపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్టు డీసీపీ చంద్రమోహన్​ తెలిపారు. నిందితులు, స్వాధీనం చేసుకున్న జింక మాంసం, కొమ్ములను అటవీశాఖ అధికారులకు అప్పగించినట్టు చెప్పారు. వన్యప్రాణుల వేటలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అన్న కోణంలో విచారణ చేస్తున్నట్టు చెప్పారు. నిందితులకు ఉన్న గన్ లైసెన్సులను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Also Read: Local Body Elections: తెలంగాణలో స్థానిక సమరంపై అనుమానాలు!.. ఎందుకంటే?

Just In

01

Pawan Kalyan: ప్రకృతితో చెలగటాలు ఆడొద్దు అంటున్న నెటిజన్స్

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు