India-Vs-Pakistan
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Ind vs Pak Match: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో నిరసనకు సిద్ధమవుతున్న టీమిండియా ప్లేయర్లు!

Ind vs Pak Match: భారత్-పాకిస్థాన్ జట్ల (Ind vs Pak Match) మధ్య క్రికెట్ మ్యాచ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఆదరణ ఉంటుంది. ఇరుదేశాల మధ్య చాలాకాలంగా ద్వైపాకిక్ష క్రికెట్ సిరీస్‌లు ముగిసిపోవడం ఇందుకు కారణంగా ఉంది. ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోయినప్పటికీ, గత దశాబ్ద కాలంలో ఐసీసీ టోర్నమెంట్లు, ఆసియా కప్‌ మ్యాచ్‌ల్లో పరస్పరం తలపడ్డాయి. అయితే, ఆదివారం (సెప్టెంబర్ 14) జరగబోయే ఆసియా కప్ 2025 గ్రూప్ దశ మ్యాచ్ గత మ్యాచ్‌లతో పోల్చితే కొంత విభిన్నమైనదిగా చెప్పాల్సిందే.

ఇటీవలే పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్–పాకిస్థాన్ మధ్య నెలకొన్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు జట్లు తొలిసారి ఢీకొంటున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడడం‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడడం సమంజసం కాదంటూ తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో జోరుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Read Also- Taliban leader: విరాట్ కోహ్లీకి తాలిబన్ లీడర్ స్పెషల్ రిక్వెస్ట్.. ఏం కోరాడంటే?

ఈ మ్యాచ్‌ను ఆడేందుకు అనుమతి ఇచ్చిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI), పాకిస్థాన్‌తో ఆడేందుకు అంగీకరించిన భారత ఆటగాళ్లను కూడా నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీంతో, బాయ్‌కాట్ డిమాండ్ల ప్రభావం టీమిండియా డ్రెసింగ్ రూమ్‌లో కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆటగాళ్లలో ఉత్సాహం కనిపించడం లేదని, కాస్త డల్‌గా కనిపిస్తున్నారని సమాచారం.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో అభిమానులు పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. భారత ఆటగాళ్ల పట్ల కూడా నిరసనలు తెలిపే అవకాశం ఉంది. కాబట్టి, మ్యాచ్ సమయంలో భారత జట్టు ప్లేయర్లు కూడా పలు చర్యల ద్వారా నిరసనల’ (symbolic protests) తెలియజేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read Also- Narendra Modi: నేను శివ భక్తుడిని.. దూషణల విషాన్ని కూడా తాగగలను: ప్రధాని మోదీ

మ్యాచ్ సమయంలో భారత ప్లేయర్లు ప్రతీకాత్మక నిరసనలు తెలిపే అవకాశం ఉందని టీమిండియా వర్గాలు తెలిపాయి. పాక్ ఆటగాళ్లతో షే‌క్‌హ్యాండ్ ఇవ్వకపోవడం, నలుపు రంగు బ్యాడ్జ్‌లు (black armbands) ధరించడం, లేదా ఇతర రూపాల్లో నిరసన వ్యక్తం చేయడం వంటి ప్లేయర్లు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా, పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ విషయంలో దేశ ప్రజల మనసులో ఎలాంటి భావోద్వేగాలు ఉన్నాయో బీసీసీఐ అధికారులు కూడా ఇప్పటికే గమనించారు. అందుకే బోర్డు అధికారులు కూడా ఈ మ్యాచ్‌ వేదికగా దేశం తరఫున ప్రపంచానికి ఓ సందేశాన్ని చాటిచెప్పే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ బాయ్‌కాట్ డిమాండ్లపై భారత జట్టు సహాయ కోచ్ రాయన్ టెన్ డోషేటే శనివారం ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత సమాజంలో ఈ మ్యాచ్ తీవ్రమైన భావోద్వేగాలను కలిగిస్తుందనే విషయం తమకు సంపూర్తిగా తెలుసునని అన్నారు. గౌతీ (గంభీర్) సందేశం చాలా ప్రొఫెషనల్‌గా ఉందన్నారు. ‘‘మన నియంత్రణలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దని గంభీర్ అన్నారు’’ అని డొషేట్ చెప్పారు.

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్‌తో కదిలిన విద్యాశాఖ.. ఎమ్మెల్యేకు పీఏగా పనిచేస్తున్న ఇంగ్లిష్ టీచర్‌పై విచారణ షురూ

Chinmayi Sripada: మంగ‌ళ‌సూత్రం కాంట్రవర్సీ.. ట్రోలర్స్‌పై చిన్మ‌యి ఫిర్యాదు

Nizamabad Crime: రియల్ ఎస్టేట్‌లో మాఫియా లేడి.. నమ్మించి రూ.లక్షల్లో వసూలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Leopard Attack: చిరుత కలకలం.. కాపుకాసి లేగదూడపై దాడి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు

Ind vs Aus 4th T20: వారెవా.. మ్యాచ్‌ను తిప్పేసిన స్పిన్నర్లు.. నాలుగో టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ