Himayat Sagar: గ్రేటర్ హైదరాబాద్ వాసుల దాహార్తి తీర్చే జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్(Usman Sagar), హిమాయత్ సాగర్(Himayat Sagar) లకు మళ్లీ వరద ఉద్ధృతి మొదలైంది. ఈ రెండు రిజర్వాయర్లకు ఎగువ ప్రాంతాలైన చేవెళ్ల(Chevella), శంకర్ పల్లి(Shankar Pally), వికారాబాద్(Vikrabad) తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో వాగుల ద్వారా భారీగా వరద నీరు చేరుతుంది. నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరే అవకాశముండటంతో జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్ కు చెందిన నాలుగు గేట్లను రెండు అడుగుల మేరకు, హిమాయత్ సాగర్ కు చెందిన ఓ గేటును నాలుగు అడుగుల ఎత్తు వరకు ఎత్తి దిగువకు మొత్తం 2224 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Also Read; Bellamkonda Sreenivas: వారికి బెల్లంకొండ బంపర్ ఆఫర్.. రైటర్స్ రెడీగా ఉండండి
పూర్తి స్థాయి నీటి మట్టం
ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు ( 3,900 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1789.30 అడుగులు (3,739 టీఎంసీలు) గా ఉంది. 1200 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తుండగా, 920 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 (2, 970 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1762.90 అడుగులు (2, 772 టీఎంసీలు) కాగా, ఈ రిజర్వాయర్ కు ఇన్ ఫ్లో కాస్త అధికంగా 3400 క్యూసెక్కులుగా ఉండగా, ఒక గేటును నాలుగు అడుగుల ఎత్తు వరకు ఎత్తి 1304 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.
Also Read: Gadwal Court: గద్వాల కోర్టు వినూత్న తీర్పు.. జిల్లాలో ఇదే తొలిసారి