Bellamkonda Sreenivas: యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో నేను కూడా ఉన్నానంటూ వస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తాజాగా ‘కిష్కింధపురి’ ప్రమోషన్ లో భాగంగా యంగ్ రైటర్స్ కు అవకాశం కల్పించేందుకు ఓ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘కిష్కింధపురి’ చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న యంగ్ రైటర్స్ మారు రాసిన కథలను నాకు పంపండి అంటూ scriptsforbss@gmail.com మెయిల్ అడ్రస్ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ తనకు చాలా ఇచ్చిందని, అయితే సినిమాకు మాత్రం ఏమీ ఇవ్వలేకపోయానన్నారు. అందుకే సినిమా కోసం ఏదోటి చేయాలని దీనిని ముందుకు తీసుకువచ్చానన్నారు. దీంతో యంగ్ రైటర్లకు ఇది మంచి అవకాశం కానుంది. సినిమా పరిశ్రమలో టాలెంట్ ఉన్నవాడికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అనడంలో ఇదో ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Read also-Nepal Prisoners: అమ్మబాబోయ్.. జైళ్ల నుంచి తప్పించుకున్న.. 13,000 మంది ఖైదీలు
ఇప్పటికే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు చేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యంగ్ రచయితలకు ఇచ్చిన అవకాశంతో బెల్లంకొండను పొగుడుతున్నారు. ఈ సినిమా ఈ సినిమా నిన్న రాత్రి హైదరాబాద్ లోని AAA ముల్టీప్లెక్స్ లో ప్రీమియర్ షో ప్రదర్శించారు. సినిమా టాక్ ఎలా ఉందంటే.. మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్లేందుకు టైమ్ తీసుకున్న దర్శకుడు ఎప్పుడైతే కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి అడుగుపెడతారో అక్కడ నుంచి సినిమాను పరిగెత్తిస్తూ భయపెట్టేసాడు. అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్ లో చేసిన పర్ఫామెన్స్ సూపర్ అనే చెప్పాలి. థ్రిల్లర్ ఎపిసోడ్స్ స్టోరీ నేరేషన్ చాలా బాగుంది. సౌండ్. ఎం.ఆర్. రాజా కృష్ణన్ ఇచ్చిన సౌండింగ్ హారర్ సినిమాను సౌండ్ తో ఎంత మ్యాజిక్ చేయచ్చో అంత చేశారు. ఓవరాల్ గా చెప్పాలంటే కిష్కింధపూరి మిమ్మల్ని భయపెడుతూ సీట్ ఎడ్జులో కూర్చోబెట్టి మరీ అలరిస్తుంది.
Read also-Charlie Kirk: ట్రంప్ సన్నిహితుడు దారుణ హత్య.. భవనం పైనుంచి షూట్ చేసిన అగంతకుడు
కిష్కింధపురి అనేది రామాయణంలోని కిష్కింధ కాండం నుంచి ప్రేరణ పొందిన ఈ టైటిల్. ఈ సినిమా భయం, మిస్టరీ సస్పెన్స్‌తో రూపొందుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం కిష్కింధపురి. కౌశిక్ పెగల్లపాటి ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాను హారర్ థ్రిల్లర్ జానర్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సెప్టెంబర్ 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో అనేక ఇంటర్వ్యూలలో సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేశారు. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. బెల్లంకొండ అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Andaru tappakunda chudandi theatres lo first day ❤️🔥🙌🏻
Oka Virupaksha, Oka Kanchana anthaka minchi bagundi #Kishkindhapuri 🫠
Nijam Cheppthuna Lag Lekunda Manchi Output Provide Chesaru Team 🫡
Congratulations 🥂 to the entire team 🥳@BSaiSreenivas @anupamahere @Koushik_psk pic.twitter.com/qfeIzVTrtp
— Uяѕтяυℓу Sαιηαтн™ ⏳🌏 (@yours_sainath) September 10, 2025