Nepal Prisoners (Image Source: twitter)
అంతర్జాతీయం

Nepal Prisoners: అమ్మబాబోయ్.. జైళ్ల నుంచి తప్పించుకున్న.. 13,000 మంది ఖైదీలు

Nepal Prisoners: హిమాలయ దేశం నేపాల్ లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. జెన్ జెడ్ నిరసనకారుల ఆందోళనతో ఆ దేశం అట్టుడుకుతోంది. రాష్ట్రపతి, ప్రధాని మంత్రి ఇళ్లను వారు తగలబెట్టిన వీడియోలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. అలాగే మంత్రులపైనా భౌతిక దాడులకు తెగబడ్డ దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే నేపాల్ లోని ఈ ఉద్రిక్త పరిస్థితులను జైళ్లల్లోని ఖైదీలు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అల్లర్లను అవకాశంగా చేసుకొని ఏకంగా వేలాది మంది ఖైదీలు జైళ్ల నుంచి తప్పించుకున్నారు.

జైళ్ల నుంచి 13,000 మంది పరారీ
నేపాల్ లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులను అడ్డుపెట్టుకొని కొందరు ఖైదీలు తప్పించుకునేందుకు యత్నించినట్లు జైళ్ల శాఖ అధికారులు పేర్కొన్నారు. నేపాల్ పోలీస్ డీఐజీ బినోద్ ఘిమిరే (Binod Ghimire) తెలిపిన వివరాల ప్రకారం.. 13,000 మందికి పైగా ఖైదీలు జైళ్ల నుంచి పారిపోయారు. జైలు శిక్ష అనుభవిస్తున్న నేపాల్ మాజీ ఉప ప్రధాని రబీ లమిచ్చెనె సైతం లలిత్ పూర్ లోని లక్కు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నారని పేర్కొన్నారు. జైలు అధికారులతో జరిగిన ఘర్షణలో ఐదారుగురు బాల ఖైదీలు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అయితే జైలు నుంచి తప్పించుకోకుండా పలువురిని అడ్డుకున్నట్లు వివరించారు.

హెలికాఫ్టర్‌కు వేలాడుతూ..
నేపాల్ లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి.. సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ వీడియో తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జెడ్ జెన్ నిరసనకారులకు భయపడి కొందరు మంత్రులు, వారి కుటుంబ సభ్యులు ఆర్మీ హెలికాఫ్టర్ కు కట్టిన తాడుకు వేలాడుతూ పారిపోతున్న దృశ్యాలు షాక్ కు గురిచేస్తోంది. దీన్ని బట్టి నేపాల్ ప్రజా ప్రతినిధుల పరిస్థితి.. ప్రస్తుతం ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతోంది.

Also Read: Charlie Kirk: ట్రంప్ సన్నిహితుడు దారుణ హత్య.. భవనం పైనుంచి షూట్ చేసిన అగంతకుడు

ప్రాణాల కోసం అర్ధించిన మంత్రి
సోషల్ మీడియా నిషేధంపై ప్రారంభమైన నిరసనలు.. నేపాల్ లో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాయి. ఆందోళనలు తీవ్రతరం అవుతుండటంతో నిరసనకారుల డిమాండ్ మేరకు ప్రధాని కేపీ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. అయితే తమ పాలకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. నేపాల్ ప్రధాని, మంత్రుల ఇళ్లపై జెన్ జెడ్ నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న నేతనలు తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలోనే నేపాల్ విదేశాంగ మంత్రిగా ఉన్న డాక్టర్ అర్జూ రాణా దేబా (Dr Arzu Rana Deuba) పైనా అందోళనకారులు దాడి చేశారు. తన ప్రాణాలను కాపాడాలంటూ ఆమె అర్థిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: Nara Lokesh: నారా లోకేష్ చొరవ.. నేపాల్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో.. వచ్చేస్తున్న ఏపీ వాసులు

Just In

01

Bunny Vas: ‘లిటిల్ హార్ట్స్’కు వచ్చే ప్రతి రూపాయి నాకు కోటి రూపాయలతో సమానం!

Srushti Fertility Centre Case: డాక్టర్ నమ్రత సీక్రెట్స్ బట్టబయలు.. ఈ ప్లాన్‌తో కోట్లు కొల్లగొట్టింది!

Raghava Lawrence: దాతృత్వం చాటుకున్న రాఘవ లారెన్స్.. ఏం చేశాడంటే?

Viral Video: బస్సులో రణరంగం.. డ్రైవర్‌ను ఎగిరెగిరి కొట్టిన మహిళ.. అందరూ షాక్!

Samantha: ఇప్పుడన్ని వదిలేసా.. సంతోషంగా ఉన్నా.. సమంత సంచలన కామెంట్స్