Marriage: పెళ్లి అనేది ఒకప్పుడు చాలా జాగ్రత్తలతో, ఏడు తరాల వరకు సంబంధాలను పరిశీలించి చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మొత్తం మారింది. ఒక్క తరం బాగుంటే చాలు, పెళ్లికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు, గతంలో మేనరికం, మేనమామ వివాహాలు హిందువుల్లో సర్వసాధారణంగా జరిగేవి. ఇలా దగ్గరి బంధువులతో పెళ్లి చేసుకోవడం వెనుక కొన్ని కారణాలు ఉండేవి.
ఆస్తి కుటుంబంలోనే ఉండాలని, బంధువుల గుణగణాలు ముందే తెలిసి ఉండటం వల్ల సమస్యలు తక్కువగా వస్తాయని నమ్మకం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్రాలు దాటి, కులమత బేధాలు పట్టించుకోకుండా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. అయితే, దూరపు వారిని పెళ్లి చేసుకునేటప్పుడు వారి లక్షణాల గురించి తెలుసుకునే అవకాశం తక్కువ. అందుకే, జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
ముందుగా, కాబోయే భాగస్వామికి ఏవైనా చెడు అలవాట్లు ఉన్నాయా ? లేవా అని తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే, చెడు అలవాట్ల వల్ల భవిష్యత్తులో గొడవలు రావచ్చు. అలాగే, వారు గతంలో ఎవరినైనా ప్రేమించారా, లేదా ప్రస్తుతం ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా అని కూడా తెలుసుకునే ప్రత్య ఇంకా, వారు డబ్బు ఖర్చు విషయంలో ఎలా ఉంటారు? అతిగా కోప్పడే స్వభావం ఉందా? ఇలాంటి లక్షణాలను ముందే తెలుసుకుంటే, భవిష్యత్తులో సమస్యలు తక్కువగా ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, పెళ్లి నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలించడం మంచిది.
Also Read: Divya Bharathi: దివ్యభారతి నా గదిలోకి వచ్చి ఏం చేసిందంటే? నిర్మాత పహ్లాజ్ నిహలానీ షాకింగ్ కామెంట్స్!