chiru ( Image Source: Twitter )
ఎంటర్‌టైన్మెంట్

Mana Shankara VaraPrasad Garu : వినాయకచవితి స్పెషల్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి న్యూ లుక్ రిలీజ్..

Mana Shankara VaraPrasad Garu : మెగాస్టార్ చిరంజీవి , అనిల్ రావిపూడి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ హై క్వాలిటీ సినిమా సంక్రాతికి విడుదల కానుంది. ఇటీవలే ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేసి ఒక్కసారిగా సినిమా పై అంచనాలు పెంచేశారు. మన శంకర వరప్రసాద్ గారు అనే కొత్త టైటిల్ తో అనిల్ రావిపూడి ఫ్యామిలీ మార్క్ కనిపించబోతుందని చెప్పేసారు

ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఒక సాలిడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది, దర్శకుడు అనిల్ రావిపూడి చాలా కేర్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను చిరంజీవి జన్మదినోత్సవం (ఆగస్టు 22, 2025) సందర్భంగా ప్రకటించారు. అయితే, నేడు వినాయక చవితి సందర్భంగా చిత్ర మేకర్స్ ఒక ఫ్రెష్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి ఒక పడవలో స్టైలిష్ వింటేజ్ లుక్‌లో కనిపించారు, అభిమానులను తెగ ఆకట్టుకున్నారు.

నేడు వినాయక చవితి సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ కేరళలో పూర్తి చేసారు. కేరళ షూట్ లో తీసిన ఒక ఫొటోతో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చిరంజీవి నదిలో పడవ పై స్టైల్ గా నిల్చొని సాంప్రదాయంగా పట్టు పంచె కట్టుకొని ఉన్నారు. దీంతో పండగ పూట మెగాస్టార్ కొత్త పోస్టర్ వైరల్ గా మారింది..

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం