Cybercriminals (imagecredit:twitter)
క్రైమ్

Cybercriminals: సైబర్ ఛీటింగ్ కేసులో క్రిప్టో కరెన్సీ సీజ్.. ఎంతంటే?

Cybercriminals: వధువు కోసం మ్యాట్రిమోనియల్ వెబ్​ సైట్(Matrimonial website) లో వివరాలు అప్ లోడ్​ చేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగిని సైబర్ క్రిమినల్స్(Cyber Criminals) నిలువునా ముంచారు. ముందుగా యువతిని రంగంలోకి దింపి బాధితున్ని ఉచ్ఛులోకి లాగి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేర 87.58లక్షల రూపాయలు కొల్లగొట్టారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(Telangana Cyber ​​Security Bureau) అధికారులు సైబర్ క్రిమినల్ అయిన చైనా దేశస్తుని అకౌంట్ నుంచి 2.38లక్షల రూపాయల విలువ చేసే క్రిప్టో కరెన్సీని ఫ్రీజ్​ చేయించి వాపస్​ తెప్పించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్(Shikha Goyal) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

నా అభిరుచులతో మీ అభిరుచులు

మంచిర్యాలకు చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్​ వేర్ కంపెనీలో అసోసియేట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న అతను భారత్ మ్యాట్రిమోనీలో తన వివరాలను అప్ లోడ్ చేశాడు. ఈ క్రమంలో జనవరి 18న వాట్సాప్​ ద్వారా కాల్ చేసిన యువతి తన పేరు నందితా రెడ్డి అని పరిచయం చేసుకుంది. నా అభిరుచులతో మీ అభిరుచులు కలుస్తున్నాయంటూ ముగ్గులోకి దింపింది. ఆ తరువాత రెగ్యులర్ గా వాట్సాప్ కాల్స్(WhatsApp calls) చేస్తూ ఛాటింగ్ చేస్తూ బాధితునికి సన్నిహితంగా మారింది. ఆ తరువాత కొన్ని రోజులకు తాను మలేషియా వెళుతున్నట్టు చెప్పింది. క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల్లో తనకు నైపుణ్యం ఉన్నట్టు నమ్మించిన (http://akktcoinfx.com/) అన్న లింక్​ ను పంపించి తాను చెప్పినట్టుగా పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు సంపాదించ వచ్చని చెప్పింది. ఇలా, ఒక్క ఏప్రిల్​ నెలలోనే బాధితునితో 4‌‌0.30లక్షల రూపాయలను పెట్టుబడులుగా తాను చెప్పిన ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేయించింది.

Also Read: Kukatpally Murder Case: నా కూతుర్ని చంపినట్లు.. బాలుడి పేరెంట్స్‌కు ముందే తెలుసు.. సహస్ర తండ్రి

చైనా దేశానికి చెందిన చువాంగ్​ జువాన్​

దీనిపై 2 కోట్ల రూపాయలు లాభం వచ్చినట్టుగా బాధితుని అకౌంట్​ లో చూపించింది. దీంట్లో నుంచి 34 లక్షల రూపాయలు డ్రా చేయటానికి బాధితుడు ప్రయత్నించగా వీలు పడలేదు. దాంతో నందితా రెడ్డి(Nandita Reddy)ని సంప్రదించగా 5శాతం టాక్స్ కట్టాలని చెప్పి మరో 9.60లక్షలు బదిలీ చేయించింది. ఇలా పలు దఫాలుగా 87.58 లక్షల రూపాయలను దోచేసింది. అప్పుడు మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ కృష్ణమూర్తి, ఏసీపీ రంగారెడ్డి(ACP Ranga Reddy) పర్యవేక్షణలో విచారణ ప్రారంభించారు. దీంట్లో చైనా(China) దేశానికి చెందిన చువాంగ్​ జువాన్​(Chuang Zuan) అనే వ్యక్తికి చెందిన క్రిప్టో కరెన్సీ వాలెట్(Cryptocurrency wallet) లో కొంత డబ్బు డిపాజిట్ అయినట్టుగా వెల్లడైంది. వెంటనే ఆ ఖాతా ఉన్న సంస్థను అలర్ట్ చేసిన అధికారులు అందులో ఉన్న 2.38లక్షల రూపాయల విలువ చేసే క్రిప్టో కరెన్సీని ఫ్రీజ్​ చేయించారు. ఆ తరువాత కోర్టు అనుమతితో ఆ డబ్బును బాధితునికి అప్పగించారు.

Also Read: Etela Rajender: కాంగ్రెస్‌పై మరోసారి విమర్శలు గుప్పించిన ఈటల రాజేందర్

Just In

01

Kasibugga Temple Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట.. 9 మంది దుర్మరణం.. దుర్ఘటన వెనుక 11 కారణాలు ఇవే!

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ధరల నియంత్రణపై స్పందించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Peddi: అచ్చియమ్మగా జాన్వీ కపూర్.. డబుల్ ట్రీట్ ఇచ్చిన మేకర్స్!

Kasibugga Temple Tragedy: ప్రైవేటు ఆలయం అంటే ఏమిటి?, కాశీబుగ్గ తొక్కిసలాట ప్రభుత్వానికి సంబంధం లేదా?

Ekadashi: పెళ్ళి కానీ యువతులు ఏకాదశి రోజున తల స్నానం చేయడకూడదా?