Kukatpally Murder Case: హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా మీడియాతో మాట్లాడిన సహస్ర తండ్రి కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. తన కూతుర్ని మైనర్ బాలుడు హత్య చేశాడన్న విషయం అతడి తల్లిదండ్రులకు ముందే తెలుసని ఆరోపించారు. వారిని సైతం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో తన బిడ్డ ప్రాణాలను బలిగొన్న బాలుడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టాలని పట్టుబట్టారు.
‘నా బాబుతో క్రికెట్ ఆడేవాడు’
తన కూతురు సహస్రను పదో తరగతి చదువుతున్న మైనర్ బాలుడు పక్కా ప్లాన్ తోనే హత్య చేశాడని తండ్రి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘వాడిని పెట్రోల్ పోసి తగలబెట్టాలి. మైనర్ అయ్యుండి ఇంతటి దారుణానికి పాల్పడటాన్ని నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించేంతవరకూ తాను ప్రభుత్వంతో కొట్లాడుతానని అన్నారు. అయితే నిందితుడితో తనకు ముఖ పరిచయం ఉన్నట్లు కృష్ణ తండ్ి తెలిపారు. ‘అప్పుడప్పుడు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండేవాడు. నా బాబు తోని క్రికెట్ ఆడుతుండేవాడు. వాళ్ల తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. వాడు పెద్ద క్రిమినల్ మైండెడ్ గా ఉన్నాడు. ఏ తల్లిదండ్రులకి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఇప్పటికీ వాడు హత్య చేశాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను’ అని సహస్ర తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
బాలుడి తల్లిదండ్రుల గురించి..
‘మైనర్ బాలుడు నా ఇంట్లో రూ. 85వేలు దొంగతనం చేశాడు. ఆ విషయం తన తల్లిదండ్రులకు కూడా తెలుసు. ఐదు రోజుల వరకు అతను దొరకలేదంటే నిందితుడి తల్లిదండ్రులకి కచ్చితంగా తెలుసు. హత్య చేసినట్టు తెలిసినా వారు తెలియకుండా దాచారు. సహకరించిన తల్లిదండ్రులను కూడా శిక్షించాలి. మా బాబు చదువుతున్న స్కూల్లోనే నిందితుడు చదువుతున్నాడు. మా బాబుకి పరిచయం ఉండడంతో మా పాప బర్త్ డే పార్టీకి కూడా వచ్చాడు. మా బాబుతో కలిసి ఇంటికి వచ్చినప్పుడే ఇంటిని మొత్తం రెక్కి చేశాడు’ అని కృష్ణ చెప్పుకొచ్చారు.
నా బిడ్డను చంపిన వాడికి భూమి మీద బతికే హక్కు లేదు : సహస్ర తండ్రి
అలంటి క్రిమినల్స్ ని వదిలేస్తే నా లాంటి తండ్రులను ఎంతో మందిని ఏడిపిస్తాడు
ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి
చట్టం, పోలీసులు, ప్రభుత్వం వాడిని మైనర్ అని, బాలుడు అని పరిగణించొద్దు
నా బిడ్డని చంపిన తర్వాత మా మధ్యే… pic.twitter.com/WZjVPnvNJ9
— BIG TV Breaking News (@bigtvtelugu) August 23, 2025
Also Read: Viral Video: రూ.1.8 కోట్ల జీతంతో ఉద్యోగం.. తీరా రోడ్ల వెంట ఐస్‌క్రీమ్ అమ్ముకుంటున్న ఉద్యోగి!
ఆ రోజు ఏం జరిగిందంటే?
కూకట్‌పల్లి(Kukatpally) సంగీత్ నగర్‌లో నివాసముంటున్న 12 ఏళ్ల సహస్ర.. సోమవారం (ఆగస్టు 18న) దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది. రేణుక, కృష్ణ దంపతులకు సహస్ర (12), కుమారుడు ఉన్నారు. రేణుక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తుండగా కృష్ణ బైక్ మెకానిక్. కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న సహస్ర స్కూల్ కు సెలవులు ఉండటంతో ఇంటి వద్దనే ఉంటోంది. సోమవారం రేణుక, కృష్ణలు తమ తమ పనులపై వెళ్లిపోయారు. వారి కుమారుడు స్కూల్ కు వెళ్లగా సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. ఈ క్రమంలో ఆమె ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన బాలుడు.. సహస్రను హత్య చేసి పరారయ్యాడు.