Viral Video: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఒక చిన్నపాటి జాబ్ కోసం లక్షలాది మంది యువకులు పోటీ పడుతున్నారు. చదువుకు తగిన జాబ్ కాకపోయిన చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా రూ.2 కోట్ల ప్యాకేజీతో జీతాన్ని అందుకున్నాడు. అదే సమయంలో రోడ్డు పక్కన ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అసలేం జరిగిందంటే?
వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. ఒక రోడ్డుపై ఉన్న ఫుట్ పాత్ బ్రిడ్జ్ పై ఓ కాలేజీ ప్రకటన ఉంది. ఓ కాలేజీకి సంబంధించినట్లుగా ఉన్న ఆ యాడ్ లో ఓ వ్యక్తి రూ.1.8 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించినట్లు చూపించారు. తమ కాలేజీలో చేరితే మీరు కూడా ఆ వ్యక్తిలా అద్భుతమైన ప్యాకేజీతో ప్లేస్ మెంట్ సాధించవచ్చని ప్రకటనలో చూపించారు. తీరా ఆ ప్రకటనలో ఉన్న వ్యక్తి.. రోడ్డు పక్కన ఐస్ క్రీమ్ అమ్ముకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also Read: Viral Video: నిర్మానుష్య వీధిలో వెళ్తోన్న వ్యక్తి.. మీదకు దూసుకొచ్చిన 7 కుక్కలు.. తర్వాత జరిగిందిదే!
ఎడ్యుకేషన్ మాఫియా ఆగడాలు..
అయితే ఇది ఎడ్యుకేషన్ మాఫియా ఆగడాలకు నిదర్శమని పలువురు అభిప్రాయపడుతున్నారు. తమ కాలేజీలో చేరితే ఉద్యోగం ఖాయమని మభ్యపెడుతూ విద్యార్థులను యాజమాన్యాలు ఆకర్షిస్తున్నాయని చెబుతున్నారు. ఒకసారి చేరాక.. ఎలాంటి ప్లేస్ మెంట్స్ లేకుండా చివరకూ వారంతా తమ చదువును పూర్తి చేసుకొని రోడ్లపైకి వచ్చేస్తున్నారని చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రకటనలు చూసి ఎవరూ మోసపోవద్దని పలువురు సూచిస్తున్నారు.
Also Read: BC Reservation Bill: బీసీలకు మహర్దశ.. రాష్ట్రంలో అదనంగా 23,973 పదవులు.. పర్‌ఫెక్ట్ ప్లానింగ్!
ఏఐ వీడియో or రియల్!
ఉద్యోగికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. ఒరిజినల్ యాడ్ లో ఉన్న వ్యక్తికి ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్న వ్యక్తి ఫొటోను పెట్టి.. ఇలా వైరల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలను ఎవరూ నమ్మవద్దని సోషల్ మీడియా వేదికగా సూచిస్తున్నారు. మెుత్తంగా ఉద్యోగికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశంలో ఎడ్యుకేషన్ మాఫియా ఆగడాలు..
ఇతనికి దాదాపు రూ. 2కోట్లు జీతంతో ఉద్యోగం వచ్చిందంటూ ప్రచారం..
తీరా చూస్తే అతగాడు అక్కడే ఐస్ క్రీమ్ అమ్ముతూ దర్శనం ఇచ్చాడు! #EducationMafia #UANow pic.twitter.com/QQ13MOi9J0
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) August 22, 2025