Oka Parvathi Iddaru Devadasulu: భగ్న ప్రేమికులు అనగానే గుర్తొచ్చే పేరు పార్వతి, దేవదాసు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘దేవదాసు’ సినిమా ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అంతే. ఈ సినిమాలో అక్కినేని నటనకు అప్పట్లో నీరాజనాలు పలికారు. ఆ కథ విషయానికి వస్తే.. దేవదాసు, పార్వతి చిన్ననాటి స్నేహితులు, ఒకరినొకరు అమితంగా ప్రేమించుకుంటారు. కానీ వారి సామాజిక అంతరాలు వారి పెళ్లికి అడ్డంకిగా మారతాయి. పార్వతిని వేరే పెళ్లి చేసుకోవాలని ఆమె తండ్రి నిర్ణయించడంతో.. దేవదాసు ఆ బాధను తట్టుకోలేక తాగుడుకు బానిస అవుతాడు. జీవితంలో నిరాశ చెంది, చంద్రముఖి అనే వేశ్య దగ్గరకు చేరుకుంటాడు. దేవదాసు ప్రేమను చూసి చంద్రముఖి చలించిపోతుంది. అతడిని పూజిస్తూ తన వృత్తిని వదిలి అతనికి సేవలు చేస్తుంది. అయితే, దేవదాసు తన ప్రేమని, పెళ్లిని పూర్తిగా దూరం చేసుకుంటాడు. అతిగా తాగడం వల్ల దేవదాసు ఆరోగ్యం క్షీణించి చివరికి పార్వతి ఇంటి ముందు మరణిస్తాడు.. టూకీగా ఇదే ఆ ‘దేవదాసు’ కథ.
Also Read- Allu Aravind: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్
అప్పుడు ఒక్క దేవదాసు కథే ఇంత హృద్యంగా ఉంటే.. ఇప్పుడు ఒక పార్వతికి ఇద్దరు దేవదాసులను సెట్ చేస్తున్నారు. అర్థం కాలేదా.. ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ (Oka Parvathi Iddaru Devadasulu Movie) టైటిల్‌తో ఇప్పుడో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా వివరాలు తెలుపుతూ.. తాజాగా చిత్ర పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. పార్వతి దేవదాసుల ప్రేమ కథకున్న క్రేజ్‌ని మరింత వైవిధ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని అంటున్నారు మాహిష్మతి ప్రొడక్షన్స్ నిర్మాత. మాహిష్మతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై తోట రామకృష్ణ దర్శక నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రఘు బాబు, కశి రెడ్డి రాజ్ కుమార్, వీర శంకర్, గౌతం రాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రవితేజ, రజిత ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read- Highest Stray Dogs State: దేశంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో తెలుసా? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!
రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని నిర్మాత తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు చాలా మంచి స్పందన వచ్చిందని, ఇదొక కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని, యువతను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకనిర్మాత తోట రామకృష్ణ మీడియాకు తెలియజేశారు. మోహిత్ రహమానియాక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్‌తో పాటు సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల ఈ చిత్ర పాటలకు ఆకట్టుకునే సాహిత్యం అందించినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు