Gin Movie: టికెట్ డబ్బులకు సరిపడా వినోదం పక్కా అందిస్తాం..
jin-movie(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Gin Movie: టికెట్ డబ్బులకు సరిపడా వినోదం పక్కా అందిస్తాం..‘జిన్’ చిత్ర దర్శకుడు చిన్మయ్ రామ్

Gin Movie: సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మాతగా చిన్మయ్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జిన్’. ఈ మూవీలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు అందరినీ మెప్పించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో దర్శకుడు చిన్మయ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే..

Read also-Shambala Movie: ‘శంబాల’ షూటింగ్‌లో గాయాలను సైతం లెక్కచేయని ఆది సాయికుమార్..

దర్శకుడు మాట్లాడుతూ.. మాది కర్ణాటక. కన్నడ ఇండస్ట్రీలో నేను 17 ఏళ్ల నుంచి ఉన్నాను. ఇప్పటికే నేను కన్నడ భాషలో రెండు చిత్రాలు తీశాను. తెలుగులో ‘జిన్’ నా మొదటి చిత్రం. ‘జిన్‌’తో తెలుగులో నా ప్రయాణం ప్రారంభం అవుతుండటం ఆనందంగా ఉంది. పర్వేజ్ సింబా నాకు మంచి మిత్రుడు. పర్వేజ్‌తో కలిసి నేను ఓ మూవీని ప్రారంభించాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. ఆ తరువాత పర్వేజ్ తన కలలో వచ్చిన ఈ ‘జిన్’ కథ గురించి చెప్పాడు. అలా ఈ ‘జిన్’ జర్నీ ప్రారంభమైంది. మా ఫ్రెండ్స్ గ్యాంగ్‌కు సంబంధించిన వ్యక్తికి మా నిర్మాత నిఖిల్ గారు పరిచయం. అలా ఆయన వద్దకు ఈ ‘జిన్’ కథ వెళ్లింది. ఆయనకు కథ చాలా నచ్చింది. డిఫరెంట్‌గా ఉంది.. కొత్త కాన్సెప్ట్‌లా ఉంది అని ఆయన వెంటనే సినిమాను నిర్మించేందుకు ఒప్పుకున్నారు.

నిఖిల్ లాంటి నిర్మాత అందరికీ దొరకాలి. ఆయన సినిమా కోసం ప్రాణం పెడతారు. మూవీ బాగా రావాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పటికి కూడా సినిమా కోసం పరితపిస్తూనే ఉన్నారు. మూవీ బాగా రావాలని ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే ‘జిన్’ ఇంత వరకు వచ్చింది. ‘జిన్’ చిత్రీకరిస్తున్నప్పుడు మాకు వింత అనుభవాలు ఎదురయ్యాయి. సెట్‌లో కెమెరా లైట్స్ వాటంతట అవే ఆఫ్ అయ్యేవి. కెమెరాలు సెట్‌లో సరిగ్గా పని చేసేవి కావు. అలా మాకు సెట్‌లో చాలా వరకు నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. ఇదంతా జిన్ ప్రభావమే అని టీం అనుకుంటూ ఉండేది. ఒకసారి మేం ప్రమోషన్స్ ముగించుకుని హైదరబాద్ నుంచి బెంగళూర్ వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో అందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. అసలం మేం ఆ రోజు ఆ ప్రమాదం నుంచి బయటపడి బతకడమే ఓ వరం, అదృష్టంలా అనిపిస్తుంది.

Rrad also-Avatar 3 review: ‘అవతార్ 3’ ఫస్ట్ ఇంటర్నేషనల్ రివ్యూ.. అడ్డంగా బుక్కైపోతారట!

‘జిన్’ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అలెక్స్ మొదటి హీరో అని చెబుతాను. నేను ఎంత బాగా తీసినా కూడా ఆయన ఆర్ఆర్ బాగా లేకపోతే సినిమా నిలబడదు. నేను తీసిన దానికి మూడు రెట్లు ఆయన ఆర్ఆర్ ఇచ్చారు. ఆయన తన సంగీతంతో ప్రతీ సీన్‌ను ఎలివేట్ చేశారు. సునిల్ గారి విజువల్స్ కూడా ఈ మూవీకి ప్లస్ అవుతాయి. ఆయన మంచి టెక్నీషియన్. ‘జిన్’ చిత్రం కొత్త కాన్సెప్ట్‌తో వస్తుంది. జిన్ గురించి చాలా మందికి ఎక్కువగా తెలియదు. థియేటర్‌లోకి వచ్చి కూర్చున్న ప్రేక్షకుడ్ని ఎంటర్టైన్ చేసేలా మా సినిమా ఉంటుంది. ప్రేక్షకుడు పెట్టే టికెట్ డబ్బులకు సరిపడా వినోదాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాను. ‘జిన్’ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తే వెంటనే ‘జిన్ 2’ మూవీని ప్రారంభిస్తాను. ఆల్రెడీ ‘జిన్ 2’ స్క్రిప్ట్ కూడా రెడీగానే ఉంది. థియేటర్‌కు వచ్చి ఆడియెన్స్ మా మూవీని ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు తీసేందుకు మాకు ఎనర్జీ వస్తుంది.

Just In

01

Telangana News: పలు జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు.. విద్యాశాఖ కీలక నిర్ణయం

RBI Governor: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ.. ఎందుకంటే?

Private Hospitals: కడుపుకోత.. గద్వాలలో డాక్టర్ల కాసుల కక్కుర్తి.. ఏం చేస్తున్నారంటే?

Champion Trailer: రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన శ్రీకాంత్ వారసుడు..

BRS party – KTR: బీఆర్ఎస్‌కి పూర్వవైభవం మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్