Avatar 3 review: ‘అవతార్ 3’ ఫస్ట్ ఇంటర్నేషనల్ రివ్యూ..
avatar-3(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Avatar 3 review: ‘అవతార్ 3’ ఫస్ట్ ఇంటర్నేషనల్ రివ్యూ.. అడ్డంగా బుక్కైపోతారట!

Avatar 3 review: జేమ్స్ కామెరాన్ సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం ‘అవతార్’ సిరీస్ నుంచి మూడవ భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 19న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. అయితే ఇప్పటికే పలు దేశాల్లో డిసెంబర్ 17న ఈ సినిమా ప్రీమియర్ వేశారు. అయితే ఈ సినిమా గురించి ఓ అంతర్జాతీయ పత్రిక ఇచ్చిన వివరణ అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. అసలు ఆ మీడియా చానల్ ఏం చెప్పింది. అన్న విషయాలు తెలియాలి అంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే. అవతార్ ‘ద వే ఆఫ్ వాటర్’ ఘనవిజయం తర్వాత, ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం ఆ అంచనాలను ఎంత మేరకు అందుకుందో చూద్దాం.

Read also-Nidhhi Agarwal: లూలూమాల్ ఘటనపై సీరియస్ అయిన పోలీసులు.. మాల్ యాజమాన్యంపై సుమోటో కేసు..

ఈ సినిమా ‘ద వే ఆఫ్ వాటర్’ ముగిసిన తర్వాతి నుండే ప్రారంభమవుతుంది. జేక్ సుల్లీ (సామ్ వర్తింగ్టన్), నెయిత్రి (జో సల్దానా) తమ పెద్ద కుమారుడిని కోల్పోయిన బాధలో ఉంటారు. తమ టీనేజ్ పిల్లల బాధ్యతలతో పాటు, ‘స్కై పీపుల్’ (మనుషులు) నుండి తమ ప్రజలను రక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉంటుంది. ఈ క్రమంలో, పాత శత్రువు కల్నల్ మైల్స్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్) మరింత క్రూరంగా పగ తీర్చుకోవడానికి తిరిగి వస్తాడు. ఈసారి అతనికి ‘వరాంగ్’ అనే కొత్త శత్రువు తోడవుతుంది. ఆమె అగ్ని తెగ (Ash People) నాయకురాలు. ఈ అగ్ని తెగ వారు మిగిలిన నావి తెగల కంటే భిన్నంగా, కొంత క్రూరంగా ఉంటారు. సుల్లీ కుటుంబం ఈ కొత్త ముప్పును ఎలా ఎదుర్కొంది అనేదే ఈ చిత్ర ప్రధానాంశం.

Read also-Avatar Fire and Ash: జేమ్స్ కామెరూన్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమాపై పాన్ ఇండియా దర్శకుడు ప్రశంసలు..

ఓ అంతర్జాతీయ పత్రిక ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఈ సినిమా అవతార్ సిరీస్ లలో వచ్చిన అన్నింటిలో అసలు బాగోలేనిదిగా ఆ నివేదిక చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ క్రిటిక్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ సినిమా జేమ్స్ కామెరూన్ సినిమా అనిపించలేదు. అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ సినిమాను చూసిన కొందరు తమ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలిపారు. ఒక వ్యక్తి అయితే ఈ సినిమా మొదటి భాగం చాలా సాగదీశారు అని, రెండో భాగంలో అయితే తాను ఏ సినిమాకు చేయలేని విధంగా ఈ సినిమాలో నిద్రపోయాను అని చెప్పుకొచ్చారు. దీంతో అందరూ ఒక్క సారిగా ఇంతటి హైప్ తో వచ్చిన సినిమా ఇలా నెగిటివ్ రివ్యూలు రావడంతో సినిమా చూడాలా వద్దా అన్న సందేహంలో ఉండిపోయారు.

Just In

01

Ponnam Prabhakar: కాంగ్రెస్‌లోకి ఇండిపెండెంట్ సర్పంచ్‌లు.. మంత్రి పొన్నం ప్రశంసల జల్లు

Chiranjeevi Movie: ‘మనశంకరవరప్రసాద్ గారు’ స్పీడు చూస్తే ఈ సంక్రాంతికి హిట్ కొట్టేలా ఉన్నారు.. బాసూ ఏంటా గ్రేసూ..

Mynampally Rohit Rao Protest: ఉపాధి హామీపై కేంద్రం కుట్ర.. పేదల కడుపు కొట్టొద్దు.. బీజేపీపై మెదక్ ఎమ్మెల్యే ఫైర్

CM Revanth Reddy: పంచాయతీ ఫలితాలపై సీఎం రేవంత్ తొలిసారి స్పందన.. కేసీఆర్‌కు ఒక సవాలు

Harish Rao: మా సర్పంచ్‌లను బెదిరిస్తే.. వడ్డీతో సహా తిరిగిస్తా.. హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్