Allu Aravind: ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.. అంటూ మెగా నిర్మాత అల్లు అరవింద్ (Producer Allu Aravind) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సైమా’ 2025 (SIIMA సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక సెప్టెంబరు 5, 6 తేదీల్లో దుబాయ్‌లో గ్రాండ్‌గా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వేడుకకు ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డ్స్‌తో టాలీవుడ్ తరపున అవార్డులను అందుకున్న వారందరినీ పిలిచి, సత్కరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఏస్ నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read- Mirai Rights: బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థకు.. టాలీవుడ్ సూపర్ హీరో సినిమా రైట్స్
వాస్తవానికి ఆయన చెప్పింది నిజమే. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా క్యాస్ట్ పాలిటిక్స్‌కు పెట్టింది పేరు టాలీవుడ్. మా పెత్తనం అంటే మా పెత్తనం అన్నట్లుగా ఈ మధ్య కొందరు ప్రవర్తిస్తున్న తీరు తెలిసిందే. అలాగే ఏదైనా ఇబ్బంది వస్తే.. అందరూ కలిసి మీడియా సమావేశం నిర్వహించకుండా, ఎవరికి వారు మీడియా మీట్‌లో పెట్టి.. వారికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు నిర్మాతలకు, ఫెడరేషన్‌కు మధ్య యుద్ధపాటి వాతావరణం నడుస్తున్నా, పెద్దలు ఎవరూ కలగజేసుకోకపోవడం విశేషం. పోనీ పెద్దరికం తీసుకుని, మెగాస్టార్ చిరంజీవి వంటి వాళ్లు ఏదైనా చెబుదామనుకునే లోపు.. ఆ గుంపులోని వారు క్యాస్ట్ పాలిటిక్స్ ప్లే చేస్తూ.. ఇష్యూ సాల్వ్ కానివ్వకుండా సాగదీస్తూ వస్తున్నారు. ఆఖరికి ప్రభుత్వం కలగజేస్తుకున్నా కూడా పరిస్థితి చక్కబడకపోవడం గమనార్హం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్నారో.. లేదంటే కావాలనే అన్నారో తెలియదు కానీ, ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అని అల్లు అరవింద్.. ఈ వేడుకలో అనడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
Also Read- Bipasha vs Mrunal Thakur: మృణాల్ ఠాకూర్‌కు బిపాసా బసు ఇచ్చి పడేసింది
ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘సైమా’ను ఇంత సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్న విష్ణు, బృందాలకి అభినందనలు. 12 ఏళ్లుగా ఈ వేడుకని విజయవంతంగా నిర్వహిస్తూ ఇప్పుడు 13వ ఎడిషన్‌కి శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ (Telugu Cinema Industry) స్పందించక ముందే సైమా వారు స్పందించి.. నేషనల్ అవార్డ్స్ పొందిన వారందరినీ ఒక స్టేజ్ మీదకు తీసుకొచ్చి సత్కరించాలని అనుకోవడం నిజంగా అభినందనీయం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏడు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అందులో రెండు నేషనల్ వైడ్ కేటగిరీలో వచ్చినవి కూడా ఉన్నాయి. దీన్ని ఒక పండగ లాగా జరుపుకోవాలి. ఇండస్ట్రీ గురించి మీకు తెలిసిందేగా.. ఎవరి కుంపటి వాళ్లది. సైమా దీన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళుతున్నందుకు వారికి మరోసారి కంగ్రాచ్యులేషన్స్. అవార్డ్స్ వచ్చిన వారందరికీ నా అభినందనలు. ఈ వేడుకలో నన్ను కూడా భాగం చేసినందుకు థ్యాంక్స్.. అని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
