Harish Rao: ఉద్యమ కాలం నుంచి నేటి దాకా తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న నిన్ను, నీ కాంగ్రెస్ ను గద్దె దించుతం నా లక్ష్యమైనా, కేటీఆర్ లక్ష్యమైనా, లక్షలాది గులాబీ సైనికుల లక్ష్యమైనా ఇదే.. అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరిందన్నారు. రోజురోజుకీ పరిస్థితులు చేజారి పోతున్నాయనే సత్యం జీర్ణం కాక అవాకులు చెవాకులు పేలుతూ అక్కసు వెలగక్కారన్నారు. నాకు, కేటీఆర్ కు మధ్య మిత్ర బేధం సృష్టించాలని, తద్వారా బీఆర్ఎస్ ను బలహీన పరచాలని ఒక చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నరని ఆరోపించారు.
Also Read: Harish Rao: హరీశ్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలు? పార్టీలో సీనియర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి!
అవినీతిని ఎండగడుతం
చీప్ ట్రిక్కులకు, చిల్లర రాజకీయాలకు ఎవడు పడిపోడు. నీ కుట్రలు, కుత్సితాలు ఫలించవు గాక ఫలించవు ఉన్నారు. అనేక సార్లు చెప్పినా, మళ్లీ చెబుతున్నా.. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి ఎప్పటికైనా హరీశ్ రావు గుండెల్లో ఉండేది కేసీఆరే. హరీశ్ రావు చేతిలో ఉండేది గులాబీ జెండానే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టీకాలు, దుర్మార్గలకు వ్యతిరేకంగా నేనూ, కేటీఆర్ మరింత సమన్వయంగా, మరింత సమర్థవంతంగా రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతం. అవినీతిని ఎండగడుతం. అసమర్థతను నిలదీస్తం అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ విజయపథంలో పురోగమించడం ఖాయం మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Harish Rao: సిద్దిపేటలో ఫలించిన హరీష్ రావు వ్యూహం.. ఎక్కువ స్థానాల్లో గెలుపు!

