Gauthama buddha belongs to the entire world says cm revanth reddy Buddha Purnima: బుద్ధుడు.. విశ్వవ్యాప్తం
CM Revanth reddy on buddha purnima 2024
Political News

Buddha Purnima: బుద్ధుడు.. విశ్వవ్యాప్తం

– సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోయాయి
– బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరం
– సికింద్రాబాద్‌ మహా బుద్ధ విహారలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: మహా వైశాఖి.. వైశాఖ పూర్ణిమ.. బుద్ధ పూర్ణిమ.. ఇలా పేరు ఏదైనా దేశంలో ఈ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. వైశాఖ మాసంలోని శుక్లపక్షం పూర్ణిమ నాడు గౌతమ బుద్ధుడు జన్మించాడు. అలాగే, ఇదే రోజున కూర్మ జయంతి కూడా. అందుకే, ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది.
బుద్ధ పూర్ణిమ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్‌లోని మహా బుద్ధ విహారకు వెళ్లారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందన్నారు. రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారని, రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉందని వివరించారు. ప్రతి పనిని ధ్యానంగా చేయాలన్న సూచనలో చాలా అర్థం ఉందన్న ఆయన, ఈ సూక్తి నుంచి ఎంతో స్ఫూర్తిని తాను పొందినట్టు చెప్పారు. ఏ పని అయినా తాను ఎంతో ధ్యానంగా చేస్తానన్నారు రేవంత్ రెడ్డి. ధ్యాన మందిరం కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.

cm revanth reddy on buddha purnima
cm revanth reddy on buddha purnima

ఒక పాఠశాలను నిర్వహించాలని తాను కోరుతున్నానని, సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో స్పర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొని మారిపోయిందని, బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరమని సూచించారు. బుద్ధుడి సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరవేయడానికి అవసరమైన సహాయం వ్యక్తిగా, ప్రభుత్వంగా చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం మీది, అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. తెలంగాణలో బుద్ధ బిక్షువులకు తగిన గౌరవం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Just In

01

Fake Eye Doctors: మిర్యాలగూడలో ఫేక్ కంటి డాక్టర్ల గుట్టురట్టు కలకలం.. పరారీలో ఓ ఆర్ఎంపీ.. !

Gadwal District: పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థుల మనోవేదన.. అప్పులపాలై ఆగమాగం అంటూ..!

KTR: ‘సీఎం రేవంత్‌ను ఫుట్ బాల్ ఆడుకుంటా’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Minister Seethakka: ఉపాధి హామీ చట్టంపై కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలి: మంత్రి సీతక్క

SHE Teams: షీ టీమ్స్​ డెకాయ్ ఆపరేషన్లు.. హిజ్రాల గుట్టురట్టు.. 66 మంది అరెస్ట్