Niranjan Reddy: గ్రామపంచాయతీ పలితాలు చూస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. అధికార దుర్వినియోగానికి పాల్పడిన అత్యధిక స్థానాల్లో బీఆరెస్ గెలిచిందని, స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఏ పార్టీ ముఖ్యమంత్రి చెయ్యలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy)అన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలకు 5 నుంచి 10 శాతం మాత్రమే పలితాలు వచ్చేవి అని, మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చాలా జిల్లాలో బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందన్నారు. అత్యధిక స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది, పార్టీ మద్దతు దారులు గెలిచారని, కొన్ని జిల్లాలో 50 శాతం అధికారపార్టీ ,50 శాతం బీఆరెస్ అభ్యర్థులు విజయం సాధించారన్నారు. మిగిలిన చోట్ల బీఆరెస్ మద్దతుతో కొందరు గెలిచారన్నారు.
కేసీఆర్ ఆరోగ్యం పై హేళన
ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్వయంగా హెలికాప్టర్ వేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయిన సరే ప్రజలు బీఆరెస్ పార్టీనీ గెలిపించారన్నారు. పాలన గొప్పగా లేనందునే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఓడిపోయిందని, మా హయంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం చెయ్యలేదు, మాకొచ్చిన సీట్ల గురించి గొప్పగా చెప్పుకోలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఇన్ని స్థానాలు గెలిచాము అని మీడియా సమావేశం పెట్టుకొని చెప్తున్నాడు. దీనికి తోడు మా పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. కేసీఆర్(KCR) పైన, కేటీఆర్(KTR) పైన హరీష్ రావు పైన ఏది పడితే అది రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఆరోగ్యం పై హేళన రేవంత్ రెడ్డి హేళన చేసి మాట్లాడుతున్నాడు. యాక్టివ్ గా ఉండే రాహుల్ గాంధీ(Rahul Gandhi) బీహార్ రాష్ట్రానికి వెళ్లి ప్రచారం చేస్తే 4 సీట్లు వచ్చాయి.. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. వెంటనే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేశాడు. సుడి బాగుండి మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి గెలిచాడు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సక్సెస్ అయ్యాడు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక స్థానాల్లో మున్సిపాలిటీలు గెలిచాము అన్నారు.
Also Read: Maoists Surrender: అజ్ఞాతంలో ఉన్నవారు జన జీవనంలోకి రండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి సూచన
ఇంటికి అయ్యే ఖర్చు 5 లక్షలు
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు చెడిపేసే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటుంది. ఉపాధి హామీ పథకంలో స్టేట్ కాంట్రిబ్యూషన్‌ను 40 శాతం పెంచే ప్రయత్నం చేస్తుంది.. దీని పైన కాంగ్రెస్ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.. రైతు బంధు సకాలంలో ఇవ్వడం లేదు.. ప్రతి సీజన్ కు ఇవ్వాల్సిన రైతు బంధు సకాలంలో ఇవ్వక పోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.. 22 కోట్లు ఇందిరమ్మ గృహ నిర్మాణానికి కేటాయిస్తే ఇంతవరకు ఒక్క ఇల్లు పూర్తి చెయ్యలేదు.. మా హయంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ఖర్చు పెరిగిన మేము డబుల్ బెడ్ రూం ఇళ్ళు పూర్తి చేశాము. ఇందిరమ్మ ఇంటికి అయ్యే ఖర్చు 5 లక్షలు అని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కట్టే మేస్త్రికి అయ్యే ఖర్చు 3 లక్షలు అవుతుంది.. పాలమూరు రంగారెడ్డి పై ఇంతవరకు సమీక్ష చెయ్యలేదు. దీని పైన త్వరలోనే కేసీఆర్(KCR) సమాధానం చెప్తారు. చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై సమీక్ష లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజక్ట్ పై ఎవరు ఏమి చేశారో ప్రజలకు వివరించండి. అంతేకానీ అరుపులు కేకలు నిందలు వేయడం మానుకోవాలన్నారు. యాసింగి రైతు బోనస్ ఎప్పటి లోపు ఇస్తారో సమాధానం చెప్పాలని, ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. దీని పైన నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని, తెలంగాణ జలవనరుల పై జరుగుతున్న కుట్రల పై ఈనెల 21 తారీఖు రోజు కేసీఆర్ వివరిస్తారన్నారు.
Also Read: Pawan Kalyan on YCP: అధికారంలోకి వస్తాం.. చంపేస్తామంటే భయపడతామా? పవన్ మాస్ వార్నింగ్!

