Pawan Kalyan on YCP: వైసీపీకి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్
Pawan Kalyan on YCP (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan on YCP: అధికారంలోకి వస్తాం.. చంపేస్తామంటే భయపడతామా? పవన్ మాస్ వార్నింగ్!

Pawan Kalyan on YCP: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. విపక్ష వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ బెదిరింపు ధోరణిని ప్రదర్శించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘అధికారంలోకి వస్తాం.. చంపేస్తామంటే భయపడతామా?’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు. రౌడీయిజం చేస్తామంటే తాటతీసి కూర్చోబెడతామంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం పిఠాపురం లాంటి ప్రాంతాల్లో చిన్న పిల్లల మధ్య కులాల చిచ్చు పెడతారా? అని పవన్ నిలదీశారు. తాను అధికారంలో ఉన్నా లేకపోయినా? ఎవరికీ భయపడనని పవన్ అన్నారు.

‘కాలుకు కాలు తీస్తా’

డిప్యూటీ సీఎం పవన్.. శనివారం నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించారు. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించే దిశగా రూ.3,050 కోట్లతో అమరజీవి జలధార ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెరవలి గ్రామంలో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ వైసీపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే తమను ఏమి చేయలేకపోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. బెదిరింపులకు దిగేవారికి యూపీ సీఎం యోగి ఆదిథ్యనాథ్ ట్రీట్ మెంట్ ఇస్తే సెట్ అవుతారని పవన్ అన్నారు. కాలుకు కాలు, కీలుకు కీలు తీసేస్తేనే వారికి బుద్ధి వస్తుందన్నారు. ‘సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని విదేశాల్లో దాక్కున్నా వారికి కూడా చెబుతున్నా. ‘గీత దాటి మాట్లడవద్దు. రౌడీయిజం చేస్తామంటే తాటతీస్తాం’ అని పవన్ కళ్యాన్ సంచలన కామెంట్స్ చేశారు.

1.2 కోట్ల మందికి తాగునీరు

అంతకుముందు అమరజీవి జలధార ప్రాజెక్ట్ గురించి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్లమందికి సురక్షిత తాగునీరు అందించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తీరం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగినట్లు పవన్ తెలిపారు. అమరజీవి జలధార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నట్లు పవన్ స్పష్టం చేశారు.

Also Read: AndhraKing Taluka OTT: రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అమరజీవి పేరు పెట్టడంపై..

జలధార ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడానికి గల కారణాన్ని సైతం పవన్ సభా వేదికగా వెల్లడించారు. ‘నాకు చాలా ఇష్టమైన నాయకులు మన తెలుగునాట బూర్గుల రామకృష్ణారావు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా పని చేసి తెలుగువారంతా ఏకం కావాలని తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి పదవి త్యాగం చేశారు. ఇంకొకరు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. తెలుగువాడి ఉనికి లేని రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆయన పోరాడారు. తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేశారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికోసం ఆయన ప్రాణం చేశారు. అమరజీవి పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకుంటూ ఈ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాం’ అని పవన్ స్పష్టం చేశారు.

Also Read: Bigg Boss9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసిన ‘ది రాజాసాబ్’ హీరోయిన్.. హారర్ర్ ఎవరంటే?

Just In

01

Borugadda Anil Kumar: నేనూ పవన్ అభిమానినే.. ఫ్రీగా టికెట్లు కూడా పంచా.. బోరుగడ్డ అనిల్

India World Cup Squad: టీ20 వరల్డ్ కప్‌కు జట్టుని ప్రకటించిన బీసీసీఐ.. సంచలన మార్పులు

Commissioner Sunil Dutt: జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోండి: సీపీ సునీల్ దత్

Bigg Boss Telugu 9 Winner: గ్రాండ్ ఫినాలే.. టైటిల్ పోరులో దూసుకుపోతున్న పవన్!.. విజేత ఎవరు?

GHMC: వ్యాపారస్తులకు జీహెచ్ఎంసీ అలర్ట్.. ఫ్రీ రెన్యూవల్ డెడ్‌లైన్ నేటితో క్లోజ్!