Bigg Boss9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసిన నిధి అగర్వాల్
big-boss1042
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసిన ‘ది రాజాసాబ్’ హీరోయిన్.. హారర్ర్ ఎవరంటే?

Bigg Boss9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. తాజాగా విడుదలైన 104వ రోజు రెండో ప్రోమోలో టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ ‘ది రాజాసాబ్’ నిధి అగర్వాల్ హౌస్‌లోకి వెళ్లి సందడి చేశారు. తన రాకతో హౌస్‌లో నవ్వులు, ఆటపాటలు వెల్లివిరిశాయి. నిధి అగర్వాల్ ఇంటిలోకి ప్రవేశించగానే కమెడియన్ ఎమ్యాన్యువల్ “పాపలకే పాప.. నీవే మా పాప” అంటూ పాట పాడుతూ ఘనంగా ఆహ్వానించారు. ఆమెకు తన గదిని చూపిస్తూ, తనతో సరదాగా సంభాషించారు. ఈ క్రమంలో నిధి అగర్వాల్ తాను నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రం గురించి ప్రస్తావించారు. ప్రభాస్ గారితో కలిసి చేస్తున్న ఈ సినిమా ఒక హారర్ రొమాంటిక్ కామెడీ అని, అందరికీ నచ్చుతుందని ఆమె తెలిపారు.

Read also-AndhraKing Taluka OTT: రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నిధి అగర్వాల్ ఇంటి సభ్యులతో మాట్లాడుతూ, “మీరు ఒకవేళ విన్ అయితే ఆ తర్వాత ఏం చేస్తారు?” అని డీమాన్ ను ప్రశ్నించారు. దానికి డీమాన్ పవన్ బదులిస్తూ, “ఇండస్ట్రీలో రాణించడంతో పాటు కొన్ని గోల్స్ (Goals) ఉన్నాయి” అని చెప్పారు. అయితే ఆయన మాటల్లోని ‘గోల్స్’ను నిధి సరదాగా ‘గర్ల్స్’ (Girls) అని తప్పుగా అర్థం చేసుకున్నట్లు నటించడంతో అక్కడ నవ్వుల పూలు పూశాయి.

Read also-Vithika New House: వరుణ్ సందేశ్ కలల సౌధాన్ని చూశారా.. ఏం ఉంది బాసూ..

బీన్ బ్యాగ్ టాస్క్ తో రచ్చ

బిగ్ బాస్ నిధి అగర్వాల్ సమక్షంలో ఒక సరదా టాస్క్ నిర్వహించారు. ఇంటి సభ్యులందరూ కళ్లకు గంతలు కట్టుకుని, మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు నాట్యం చేస్తూ, మ్యూజిక్ ఆగిన వెంటనే ఖాళీగా ఉన్న బీన్ బ్యాగులను పట్టుకోవాలి. కళ్లు కనబడక పోవడంతో సభ్యులు ఒకరినొకరు నెట్టుకోవడం, కింద పడటం వంటివి అందరినీ అలరించాయి. ఈ టాస్క్ మధ్యలో ఎమ్యాన్యువల్ “నేను నిధి పాపను చూడకుండా ఉండలేకపోతున్నాను” అని తనదైన శైలిలో పంచుకున్న పంచ్‌లు హైలైట్‌గా నిలిచాయి. మొత్తానికి 104వ రోజు ఎపిసోడ్ నిధి అగర్వాల్ రాకతో ఎంతో కలర్‌ఫుల్‌గా మారింది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? టాప్ కంటెస్టెంట్స్ ఎవరనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.

Just In

01

Borugadda Anil Kumar: నేనూ పవన్ అభిమానినే.. ఫ్రీగా టికెట్లు కూడా పంచా.. బోరుగడ్డ అనిల్

India World Cup Squad: టీ20 వరల్డ్ కప్‌కు జట్టుని ప్రకటించిన బీసీసీఐ.. సంచలన మార్పులు

Commissioner Sunil Dutt: జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోండి: సీపీ సునీల్ దత్

Bigg Boss Telugu 9 Winner: గ్రాండ్ ఫినాలే.. టైటిల్ పోరులో దూసుకుపోతున్న పవన్!.. విజేత ఎవరు?

GHMC: వ్యాపారస్తులకు జీహెచ్ఎంసీ అలర్ట్.. ఫ్రీ రెన్యూవల్ డెడ్‌లైన్ నేటితో క్లోజ్!