GHMC: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అవసరానికి తగిన విధంగా అభివృద్ది, అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ(GHMC) నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్(Traffic Signals) నిర్వహణ వ్యయాన్ని ఏళ్ల నుంచి భరిస్తుంది. ఎప్పటికపుడు అవసరాలకు తగిన విధంగా ట్రాఫిక్ సిగ్నల్ మార్పిడితో పాటు నిర్వహణ వ్యయాన్ని ఏటా రూ.15 కోట్లు భరిస్తూ వస్తుంది. కానీ ఈ సిగ్నల్స్ తో ట్రాఫిక్ ఛలానాల రూపంలో నగర ట్రాఫిక్ పోలీసులు ఏటా కోట్లాది రూపాయల ఆందానీని సమకూర్చుకుంటుంది. తాజాగా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా ట్రాఫిక్ నియంత్రణకు ఏటా కొత్తగా పలు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయాల్సి వస్తుంది.
15 కోట్ల ఆర్థిక భారం
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్(Hyderabad) పోలీసు కమిషనర్, సైబరాబాద్ పోలీసు కమిషనర్నేట్‌తో పాటు రాచకొండ(Rachakonda) కమిషనర్నేట్‌ల పరిధిలో ప్రస్తుతం 223 ట్రాఫిక్ సిగ్నల్స్ ను జీహెచ్ఎంసీ(GHMC) నిర్వహిస్తుంది. సిగ్నల్స్ నిర్వహణ బాధ్యతను బీహెచ్ఈఎల్(BHEL) కు అప్పగించి, ఏటా నిర్వహణ, మరమ్మతులకు జీహెచ్ఎంసీ రూ.15 కోట్ల ఆర్థిక భారాన్ని భరిస్తుంది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో ఆదాయం లేని ట్రాఫిక్ సిగ్నల్ నిర్వహణ అవసరమా? అన్న కోణంలో దృష్టి సారించిన జీహెచ్ఎంసీ మున్ముందు ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఏళ్లుగా నిర్వహణ భారాన్ని మోస్తున్నా, ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల ఏటా భారంగా మారిన రూ. 15 కోట్ల ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Patan Cheruvu constituency: తగ్గనున్న ఎంపీటీసీల స్థానాలు.. ప్రభుత్వం గెజిట్
25 కొత్త పెలికాన్ సిగ్నల్స్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీసు కమిష్నరేట్ల పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణ, పాదచారుల భద్రత వంటి విషయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన జీహెచ్ఎంసీ(GHMC) పోలీసు శాఖల ఆధ్వర్యంలో సిటీలో అదనంగా మరో 25 పెలికాన్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మామూలుగా జంక్షన్లలో ఏర్పాటు చేసే ట్రాఫిక్ సిగ్నల్స్ కాకుండా పాదచారులు తాము రోడ్డు దాటాలనుకునే సమయంలో వినియోగించేదే పెలికాన్ సిగ్నల్. మూడు పోలీసు కమిష్నరేట్ల పరిధిలో కలిపి దాదాపు వంద పెలికాన్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను జీహెచ్ఎంసీకి పంపగా, దీనిపై పీజుబిలిటీ స్టడీ నిర్వహించిన జీహెచ్ఎంసీ(GHMC) వంద చోట్ల పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు వ్యయాన్ని భరించే పరిస్థితి లేదని, తొలుత 25 చోట్ల పెలికాన్ సిగ్నల్‌ను ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం.
ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులు
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్(Underpass) లు వంటి చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ కాకముందు నుంచి ఎంసీహెచ్ గా ఉన్నప్పటి కాలం నుంచి సిటీలోని ట్రాఫిక్ సిగ్నల్స్(Traffic Singnals) నిర్వహణ, మరమ్మతుల బాధ్యతలను నిర్వహిస్తుంది. కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ వయోలేషషన్ వంటి ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారుల నుంచి నగర పోలీసు శాఖ వసూలు చేస్తున్న ఛలానాల్లో కనీసం జీహెచ్ఎంసీకి 25 శాతం వాటాను కేటాయించాలని 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీ సర్కారుకు వరుసగా ప్రతిపాదనలను పంపుతున్నా, ఆ ప్రయత్నం ఫలించకపోవటంతో చివరకు ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు జీహెచ్ఎంసీ(GHMC) సిద్దమైనట్లు తెలిసింది.
Also Read: TSIIC: ఇచ్చిన హామీలు అమలైతేనే భూములు వదులుతాం.. రైతుల నిరసన