Patan Cheruvu constituency (imagecredit:twitter)
తెలంగాణ

Patan Cheruvu constituency: తగ్గనున్న ఎంపీటీసీల స్థానాలు.. ప్రభుత్వం గెజిట్

Patan Cheruvu constituency: రాష్ట్రంలోని సంగారెడ్డి(Sanga Reddy) జిల్లాలో పటాన్ చెరువు నియోజకవర్గంలోని పటాన్ చెరువు, జిన్నారం మండలాల్లోని 18 గ్రామాలు మున్సిపాల్టీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్​విడుదల చేసింది. 2018 పంచాయతీ రాజ్​చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్​కు గవర్నర్​జిష్ణు దేవ్ వర్మ(Jishnu Dev Varma) ఆమోదం తెలిపారు. దీంతో ఆ పంచాయతీలు ఇక స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections)కు ఆ గ్రామాలు దూరం అయ్యాయి. పటాన్​చెరువులో 8 గ్రామాలు, జిన్నారంలో 10 గ్రామాలు మున్సిపాల్టీలో విలీనం చేశారు. దీంతో ఎంపీటీసీ (మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు) స్థానాలు, ఒక ఎంపీపీ(MPP) స్థానం తగ్గుతుంది.

తగ్గిన గ్రామ పంచాయతీల సంఖ్య
రాష్ట్రంలో ప్రస్తుతం 5,773 ఎంపీటీసీ(MPTC) స్థానాలు ఉండగా స్వల్పంగా తగ్గనున్నాయి. 566 ఎంపీపీ(MPTC), జడ్పీటీసీ(ZPTC) స్థానాలు ఉండగా జిన్నారం మండలం మున్సిపాల్టీలో కలవడంతో వీటి సంఖ్య 565కు చేరింది. ప్రస్తుతం పంచాయతీల సంఖ్య 12,778 ఉండగా 12,760కి తగ్గింది. గతంలో 32 జడ్పీలు(ZPTC) ఉండగా మేడ్చల్​మల్కాజిగిరి(Medchal Malkajgiri) జిల్లా వివిధ మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో విలీనం కావడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి ఈ జిల్లాను తొలగించారు. దీంతో జడ్పీల(ZP) సంఖ్య 31కి చేరినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే పంచాయతీరాజ్​శాఖ ఎంపీటీసీ(MPTC)ల డీలిమిటేషన్ షెడ్యూల్(Delimitation Schedule) కు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే రాష్ట్రంలో ఎంపీటీసీ(MPTC), ఎంపీపీ(MPP), జడ్పీటీసీZPTC) స్థానాల లెక్క తేలనున్నది.

Also Read: GHMC: ఒకే పోలింగ్ బూత్‌లో ఫ్యామిలీ ఓటింగ్.. కసరత్తు చేస్తున్న జీహెచ్ఎంసీ

ఉపాధికి దూరం
18 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఆ గ్రామాల ప్రజలకు ఉపాధిహామీ పథకా(Employment Guarantee Scheme)నికి దూరం అవుతున్నారు. ఇప్పటివరకు కాలంతో పనిలేకుండా ప్రజలకు ఉపాధి పనులు దొరికేవి. ప్రజలకు ఆర్ధిక చేయూత ఇచ్చేది. అయితే ఇక నుంచి ప్రజలకు ఉపాధిహామీ పథకం వర్తించదు. దీంతో కొంత ఆర్థికంగా కొంత ఇబ్బందులు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Also Read: Medchal highway: నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు.. రాకపోకలకు ఇబ్బందులు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?