Mobile Recovery 9 image crdit: swetcha reporter)
హైదరాబాద్

Mobile Recovery: 45 రోజుల్లో 827 మొబైల్ ఫోన్ల స్వాధీనం

Mobile Recovery: సెల్​ ఫోన్ చోరీ అయినా.. పోగొట్టుకున్నా వెంటనే బాధితులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్​) ముత్యంరెడ్డి (‘ DCP Muthyam Reddy )సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా కూడా కంప్లయింట్ ఇవ్వవచ్చని చెప్పారు. సైబరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్​ పోలీసులు 45 రోజుల్లో 2కోట్ల రూపాయల విలువ చేసే 827 మొబైల్​ ఫోన్లను రికవరీ చేశారు. సైబరాబాద్ పోలీస్ ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని బాధితులకు అప్పగించారు.

 Also Read: Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!

6,233 సెల్​ ఫోన్లను రికవరీ

ఈ సందర్భంగా డీసీపీ ముత్యం రెడ్డి (DCP Muthyam Reddy)మాట్లాడుతూ, సెల్ ఫోన్లలో ముఖ్యమైన వ్యక్తిగత సమాచారం ఉంటుందన్నారు. వేరే వారి చేతుల్లోకి ఈ సమాచారం చేరితే చెడు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. దానికి తోడు చోరీ అయిన, పోగొట్టుకున్న ఫోన్లను అసాంఘిక శక్తులు సంఘ విద్రోహ కార్యకలాపాలకు వినియోగించే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పారు. ఎనిమిది విడతల్లో సైబరాబాద్ పోలీసులు మొత్తం 6,233 సెల్​ ఫోన్లను రికవరీ చేసి సొంతదారులకు అప్పగించినట్టు తెలిపారు. ఇక, సైబర్ నేరాలపట్ల ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సెల్​ ఫోన్ల రికవరీలో కీలకపాత్ర

అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని చెప్పారు. ఏపీకే ఫైళ్లను డౌన్​ లోడ్ చేయవద్దన్నారు. సైబర్​ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్​‌కు ఫోన్​ చేసి ఫిర్యాదు ఇవ్వాలన్నారు. దాంతోపాటు cybercrime.gov.in అన్న వెబ్ సైట్‌కు కూడా సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. సెల్​ ఫోన్ల రికవరీలో కీలకపాత్ర వహించిన అదనపు డీసీపీ (క్రైమ్స్​) రామ్​ కుమార్​, సీసీఎస్​ ఏసీపీ నాగేశ్వరరావు, సీఐలు సంజీవ్, పవన్​, రవికుమార్​, డాలినాయుడు, రాజేశ్‌తోపాటు సిబ్బందిని అభినందించారు.

 Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..

Just In

01

Viral News: కారులోంచి దూకి ప్రియుడు మృతి.. అసలేం జరిగిందో తెలిస్తే షాక్

YS Sharmila: నా బిడ్డ రాజకీయాల్లోకి వస్తే.. వైసీపీకి ఎందుకంత ఉలికిపాటు.. వైఎస్ షర్మిల

Warangal District: రజాకార్లపై విరోచితంగా పోరాడిన యోధుల గాధ.. స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం

Viral Video: బాత్రూం ఖాళీగా లేదా? ఈ పని చేయడానికి మెట్రోనే దొరికిందా!

only murders in the building season 5: కితకితలు పెట్టిస్తున్న థ్రల్లర్ సిరీస్.. ఎక్కడంటే?