Tollywood Actress ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Tollywood: విడాకులు తీసుకుబోతున్న అల్లు అర్జున్ హీరోయిన్..?

Tollywood: తెలుగు, తమిళ చిత్రాల్లో మెప్పించిన స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోలతో నటించింది. హీరో రామ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ , మంచు విష్ణు నటించి మంచి పేరు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుంది.

విడాకులకు రెడీ అయిన హన్సిక మోత్వానీ?

కెరీర్ మంచిగా సాగుతున్న సమయంలో  మూడేళ్ల క్రితం (2022) ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతురియాను వివాహం చేసుకుంది. సోహైల్‌కు ఇది రెండో పెళ్లి . అయినప్పటికీ, హన్సిక అతడిని అర్థం చేసుకొని ఈ పెళ్ళికి ఒప్పుకుంది. పెళ్లి తర్వాత వీరిద్దరూ హనీమూన్‌లు, విదేశీ పర్యటనలు, వెకేషన్‌లతో మంచిగా ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే, ఇప్పుడు వీరి వైవాహిక జీవితంలో గొడవలు జరుగుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత రెండేళ్లుగా హన్సిక తన తల్లితో, సోహైల్ తన తల్లిదండ్రులతో విడివిడిగా ఉంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో, వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. సోహైల్ ఈ పుకార్లను ఖండిస్తూ, వాటిలో నిజం లేదని చెప్పినప్పటికీ, విడిగా జీవిస్తున్న విషయంపై ఇంత వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Also Read: Fish Venkat: దిల్ రాజు, సోను సూద్ సాయం చేస్తామని చెప్పి.. ఫోన్ కూడా ఎత్తలేదు.. ఫిష్ వెంకట్ కుమార్తె

విడి విడిగా ఉంటున్న భార్య భర్తలు?

గతంలో హన్సిక తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేది. కానీ, ఈ మధ్య కాలంలో తన ఫొటోలను మాత్రమే షేర్ చేస్తోంది. ప్రతి ఏటా పెళ్లి రోజున ప్రత్యేక పోస్ట్‌లు పెట్టే హన్సిక, గత డిసెంబర్‌లో కూడా తన ఫోటోలు మాత్రమే షేర్ చేసింది. అయినప్పటికీ, వీరు విడిగా ఉంటున్నారా, లేక ఊహాగానాలు మాత్రమేనా అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై హన్సిక స్పందన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి, ఇప్పటికైనా ఈ ముద్దుగుమ్మ రియాక్ట్ అవుతుందో? లేదో చూడాల్సి ఉంది.

Also Read:  Throat Care: వర్షాకాలంలో గొంతు నొప్పి, చెవి దురదతో బాధ పడుతున్నారా? అయితే, ఈ చిట్కాలతో చెక్ పెట్టేయండి!

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?