Harish Rao: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై తప్పుడు లెక్కలు
Harish Rao (imagecredit:swetcha)
Telangana News

Harish Rao: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై తప్పుడు లెక్కలు: హరీష్ రావు

Harish Rao: మరో మూడేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని తెలిసిన ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీకి చుక్కలు చూపించారని మాజీ మంత్రి హరీష్ (Harish Rao)రావు పేర్కొన్నారు. అధికార పార్టీకి 90 శాతం అనుకూలంగా ఫలితాలు రావాల్సి ఉండగా తప్పుడు లెక్కలు చూపించి క్షనికానందం పొందుతున్నట్లు ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినా, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగపరచినా, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినా, సీఎం స్వయంగా డబ్బులు పంచినా 6000 మందికి మించి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచులు గెలువలేక పోయారని పేర్కొన్నారు. బిఆర్ఎస్(BRS) పార్టీ బలపరిచిన అభ్యర్థులు 4000 మందికి పైగా గెలిచారని, రెబల్స్, ఇండిపెండెంట్ లను తమ ఖాతాలో కలుపుకొని కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను మరోసారి మభ్య పెట్టాలని చూస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ లో చేరిన సందర్భంగా శుక్రవారం హరీష్ రావు మాట్లాడారు.

రైతులు, రుణమాపి పూర్తిగా అమలు

అధికార పార్టీ అభ్యర్థులు 80 నుండి 90 శాతం గెలవవలసి ఉండగా ఫలితాలు అనుకున్నట్లు రాకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం తమదే విజయమని గొప్పలు చెప్పుకుంటుందని హరీష్ రావు ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా సర్పంచ్, జెడ్పిటిసి, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో 80 నుండి 90% విజయం సాధించినట్లు పేర్కొన్నారు. మొదటి విడత ఫలితాలను చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా, పోలీసుల చేత ఇతర పార్టీ కార్యకర్తలను నిర్బంధాన్ని గురిచేసి, అనేక రకాల దుర్మార్గాలకు పాల్పడినట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ లలో పర్యటించి ఇందిరమ్మ చీరలు కట్టుకొని మహిళలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని పేర్కొనడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కొత్త రుణాలకు అర్హత కోల్పోతున్న రైతులు, రుణమాపి పూర్తిగా అమలు కాకపోవడంతో అనేకమంది రైతులు కొత్త రుణాలకు అర్హత కోల్పోతున్నారని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు లక్షలు రూపాయల రుణమాఫీ ఏ ఒక్క రైతుకు కాలేదని దీంతో సదరు రైతుల ఖాతాలు ఎం పీ ఏ అయిపోయి డిఫాల్ట ర్ గా మారుతున్నారని తద్వారా సివిల్ ర్యాంక్ పడిపోవడంతో వారి పిల్లలకు ఎడ్యుకేషన్ రుణాలు, కొత్త పంట రుణాలు రైతు కుటుంబాలు పొందలేకపోతున్నాయని పేర్కొన్నారు. రైతులను రేవంత్ రెడ్డి అన్ని విధాల మోసం చేస్తున్నారని బోనస్ ఇవ్వడం లేదని, రైతుబంధు మానేసినట్లు హరీష్ రావు ఆరోపించారు.

Also Read: V.C. Sajjanar: రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు.. ఆర్బీఐని కూడా వదలట్లే.. సజ్జనార్ బిగ్ అలర్ట్!

ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీ అభ్యర్థులను గెలిపించారు

పార్టీ మారిన ఎమ్మెల్యేలు సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని హరీష్ రావు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పడంలో రాష్ట్ర ప్రజలు అబద్దాలను కూడా ఇలా చెప్పొచ్చా అని ఆశ్చర్యాన్ని గురవుతున్నారని పేర్కొన్నారు. కండువాలు కప్పింది నిజం కాదా అని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేసింది వాస్తవం కాదని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రజలను కాంగ్రెస్ నాయకులు ఇలా నమ్మిస్తారా అని అబద్దాలకు కూడా హద్దుండాలన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతలేదని చెప్పడంలో అర్థం లేదని పలు ఆసుపత్రుల్లో విద్యార్థులు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విషయాన్ని కూడా ఇలా మభ్యపెడతారాఅని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

గజ్వేల్ లో తమదే మెజార్టీ అంటే జనం నవ్వుకుంటున్నారు

గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ తమదే మెజార్టీ అంటే జనం నవ్వుకుంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. 17 9 సర్పంచులకు గాను 92 మంది బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా 68 మంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచినట్లు హరీష్ రావు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో కూడా గజ్వేల్ లో బిఆర్ఎస్ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గజ్వేల్ లో తట్టెడు మట్టి పోయలేదని రోడ్డుపై ఏర్పడిన గుంతలో డాంబర్ తట్ట కూడా వేయలేదని ఆరోపించారు. కేసీఆర్ వల్లనే గజ్వేల్ అన్ని విధాల అభివృద్ధి చెంది రాష్ట్రంలో రోల్ మోడల్ గా మారిందని గుర్తు చేశారు. అంతకుముందు పార్టీలో చేరిన పలువురికి హరీష్ రావు కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read: BMW Teaser: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ వచ్చేసింది.. ఫ్యామిలీ టచ్ అదిరిందిగా..

Just In

01

Illegal Land Registration: ఫోర్జరీ పత్రాలతో శ్రీ సాయిరాం నగర్ లేఅవుట్‌​కు హెచ్​ఎండీఏ అనుమతి.. కోర్టు ఆదేశాలు లెక్కచేయని ఓ అధికారి..?

Hardik Pandya: పాండ్యా విధ్వంసం.. తిలక్ వర్మ మెరుపులు.. దక్షిణాఫ్రికా ముందు భారత్ రికార్డ్ స్థాయి టార్గెట్

Vithika New House: వరుణ్ సందేశ్ కలల సౌధాన్ని చూశారా.. ఏం ఉంది బాసూ..

MLA Anirudh Reddy : కాంగ్రెస్ కార్యకర్తలను టచ్ చేస్తే కన్నెర్ర చేస్తాం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Dandora Movie Trailer: శివాజీ ‘దండోరా’ ట్రైలర్ వచ్చేసింది.. ఆ మత్తు దిగాలంటే టైమ్ పట్టుద్ది సార్..