Mysterious Review: ‘మిస్టీరియస్’ సస్పెన్స్ థ్రిల్లర్‌ రివ్యూ..
missterios-review
ఎంటర్‌టైన్‌మెంట్

Mysterious Review: ‘మిస్టీరియస్’ సస్పెన్స్ థ్రిల్లర్‌ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించింది?.. రివ్యూ..

Mysterious Review: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు పెద్ద పెద్ద హిట్లు సాధించడం చాలానే చూస్తున్నాం. అలాంటి పాజిటివ్ వైబ్‌తో వచ్చిన చిన్న సినిమాల్లో ఒకటి ‘మిస్టీరియస్’.  సస్పెన్స్, థ్రిల్లర్‌ స్టోరీతో రాబోతుందని ఈ సినిమా ప్రచార చిత్రాలను చూస్తుంటేనే తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సస్పెన్స్, థ్రిల్లర్‌ సినిమాలను ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నారు. అలాంటి జానర్ లో వచ్చిన సినిమాలను కూడా ప్రేక్షకులు అమితంగా ఆదరిస్తున్నారు. దీంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రహ్మానందం రావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ పెరిగింది. అలాంటి మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

Read also-BMW Teaser: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ వచ్చేసింది.. ఫ్యామిలీ టచ్ అదిరిందిగా..

కథేంటంటే..

కొండపూర్ ఎసై రాంఖీ / రామ్ కుమార్ (అబిద్ భూషణ్) మిస్ అవుతాడు. ఆ మిస్సింగ్ కేసును ఛేదించడానికి ఏసీపీ ఆనంద్ సాయి (బలరాజ్ వాడి) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఆర్కిటెక్చర్ విరాట్ (రోహిత్ సాహ్ని) అతని భార్య శిల్ప (మేఘన రాజ్‌పుత్) ను విచారించాల్సి వస్తుంది. రాంఖీ మిస్సింగ్ కేసుకు విరాట్ – శిల్పలకు సంబంధం ఏంటి? విరాట్ కొన్న విల్లాకు రాంఖీ ఎందుకు వెళ్లాడు? ఈ కథలోకి మిస్సిరా (రియా కపూర్) ఎందుకు వచ్చింది? అసలు ఎస్ఐ రాంఖీని ఎవరు చంపారు? అనే ట్విస్ట్‌లు, సస్పెన్స్‌తో ఈ సినిమా సాగుతోంది. ఇవన్నీ తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

సినిమా చూస్తున్నంత సేపు… మనం రెగ్యులర్ లైఫ్‌లో వచ్చే కొన్ని ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు మనకు గుర్తొస్తాయి. అలాంటి కథకే కొన్ని ట్విస్ట్‌లు ఆధ్యాంతం సస్పెస్స్, థ్రిల్లర్.. అలాగే హర్రర్ టచ్ ఇచ్చి, కొన్ని జాగ్రత్తలు తీసుకుని డైరెక్టర్ కథ రాసుకున్నట్టు అర్థమైపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి.. డైరెక్టర్ పాత్రల పరిచయం విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా.. డైరెక్టర్ మెయిన్ ప్లాట్‌కి వెళ్లిపోయాడు. ఇటు కథను రన్ చేస్తూనే.. పాత్రలను పరిచయం చేస్తూ.. వెను వెంటనే ట్విస్ట్‌లు వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. సినిమాను చూసే ఆడియన్‌కు అసలు కిల్లర్ ఎవరూ అనే క్వశ్చన్ మార్క్ క్లైమాక్స్ వరకు అలాగే ఉంటుంది. అలా ఆడియన్‌ను కథకు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ కొంత వరకు సక్సెస్ అయినట్టే.

ఇంటర్వెల్‌లో కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చి.. కథను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకుళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే సినిమాలో వచ్చే ట్విస్ట్‌లు సస్పెన్స్, థ్రిల్లర్‌ను ఫీల్ అయ్యే ఆడియన్స్‌కు సెకండాఫ్‌లో ఉండే హర్రర్ ఎలిమెంట్స్ ఇంకాస్త ఇంటెన్స్ క్రియేట్ అయ్యాలా చేసింది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఓ బిగ్ ట్విస్ట్.. సినిమాను మలుపుతిప్పుతుంది. అప్పటి వరకు కిల్లర్ వీరే అని అనుకునే ఆడియన్స్ కూడా షాక్ అవుతారు. సినిమాలో మూడు పాటలు పెట్టాడు డైరెక్టర్. ఆ మూడు పాటలు కూడా సినిమాకి సరిగ్గా సెట్ అయ్యే టైంకి పెట్టడం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ పాటలకు మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు ఎమ్ఎల్ రాజా. అయితే, కథ వరకు అంతా బానే ఉన్నా.. నటీనటుల విషయంలో డైరెక్టర్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరింత బాగుండేది. అంటే.. ఇప్పుడున్న నటీనటులు అంత తెలిసిన వారు కాకపోవడం ఓ మైనస్ అని చెప్పొచ్చు.

Read also-Pawan Kalyan: సుజిత్‌కి పవన్ కళ్యాణ్ కారు గిఫ్ట్‌గా ఇచ్చింది అందుకే!.. సినిమా కోసం అంతపని చేశాడా?

నటీనటులు..

ఈ సినిమాలో దాదాపు అందరూ బాగా చేశారు. మెయిన్ లీడ్‌లో కనిపించిన రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్‌పుత్, అబిద్ భూషణ్ అద్భుతంగా చేశారు. సీనియర్ పోలీస్‌గా కనిపించిన బలరాజ్ వాడి తన మార్క్ నటన చూపించాడు. అలాగే జబర్దస్త్ ఫేం రాజమౌళికి మంచి పాత్ర వచ్చింది. బాగా నటించాడు కూడా ఆయన. అలాగే మరో జబర్దస్త్ ఆర్టిస్ట్ గడ్డం నవీన్‌ చిన్న పాత్ర చేసినా.. తన పరిధిలో బానే చేశాడు.

సాంకేతికంగా..

ఇక మ్యూజిక్ ఎమ్ఎల్ రాజా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సరైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫర్‌గా చేసిన పరవస్తు దేవేంద్ర సూరికి మంచి మార్కులు వేయొచ్చు. అయితే.. ఇదే సూరి ఎడిటర్‌గా కూడా ఈ మూవీకి వర్క్ చేశారు. ఎడిటింగ్ విషయంలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి. చివరిగా ఈ సినిమా గురించి చెప్పాల్సింది ఏంటంటే.. ‘మిస్టీరియస్’ మూవీ మిస్ చేయకుండా ఓసారి చూడాల్సిన మూవీ.

రేటింగ్ – 3 / 5

Just In

01

Akhanda 2: ‘అఖండ 2’ థియేటర్లలో సౌండ్ బాక్సులు అందుకే ఆగిపోతున్నాయ్.. బాబోయ్ కాషన్ కియా..

India vs South Africa: చివరి టీ20లో టాస్ పడింది.. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏం ఎంచుకున్నాడంటే?

RTC Bus Accident: బస్సు రన్నింగ్‌లో ఫెయిల్ అయిన బ్రేకులు.. పత్తి చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..!

Shambala Movie: ‘శంబాల’ థియేటర్‌లో మంచి ఎక్సీపిరియన్స్ చేస్తారు.. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల..

Hydraa: పాతబస్తీలో హైడ్రా దూకుడు.. ఏకంగా రూ.1700 కోట్ల భూములు సేఫ్!