Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘OG’. తాజాగా పవన్ కళ్యాణ్ సుజిత్ కు కారు కొన్న విషయం తెలిసిందే . అందులో వింత ఏం ఉందిలే అనుకుంటే పొరపాటే. అసలు కారే ఎందుకు ఇచ్చారు అనే వషయంపై సినీ పరిశ్రమలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే దీనికి కారణం ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన, హృదయానికి హత్తుకునే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read also-Sigma Movie Update: సందీప్ కిషన్ ‘సిగ్మా’ షూటింగ్ పూర్తి.. టీజర్ వచ్చేది ఎప్పుడంటే?
సినిమా కోసం సుజీత్ త్యాగం
‘OG’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు, జపాన్ షెడ్యూల్ చిత్రయూనిట్‌కు చాలా కీలకంగా మారింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సమయంలో నిర్మాణ వ్యయం పెరగడం లేదా నిధుల సర్దుబాటులో జాప్యం జరగడం వంటివి చోటు చేసుకున్నాయి. సినిమా అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్న సుజీత్, ఎవరూ ఊహించని పని చేశారు. తన సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender) కారును విక్రయించి, ఆ డబ్బును జపాన్ షెడ్యూల్ కోసం ఖర్చు చేశారు. సినిమాపై ఆయనకున్న అంకితభావానికి ఇది నిదర్శనం.
పవన్ కళ్యాణ్ స్పందన
ఈ విషయం షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్‌కు తెలియదు. ఇటీవల డబ్బింగ్ కార్యక్రమాల సమయంలో సుజీత్ తన కారును అమ్ముకున్న విషయం పవన్ దృష్టికి వచ్చింది. తన సినిమా కోసం ఒక దర్శకుడు ఇంతటి త్యాగం చేయడం పవన్‌ను ఎంతగానో కలిచివేసింది. సుజీత్ నిబద్ధతను చూసి ముగ్ధులైన పవన్, వెంటనే స్పందించారు. సుజీత్ త్యాగానికి గుర్తింపుగా, పవన్ కళ్యాణ్ ఆయనకు అదే మోడల్ (ల్యాండ్ రోవర్ డిఫెండర్) కొత్త కారును బహుమతిగా ఇచ్చారు. కేవలం కారు ఇవ్వడమే కాకుండా, ఆ కారుకు సంబంధించిన EMI (నెలవారీ వాయిదాలు) మొత్తాన్ని కూడా తానే చెల్లిస్తానని పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవడం విశేషం. ఒక నటుడు తన దర్శకుడి పట్ల ఈ స్థాయిలో కృతజ్ఞత చూపడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలో కూడా హీరో అని ఈ ఘటన నిరూపిస్తోంది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ, తన కోసం కష్టపడే వారిని గౌరవించడంలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు. సుజీత్ పట్ల ఆయన చూపిన ఈ ప్రేమ, ‘OG’ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచింది. ప్రస్తుతం ఈ వార్త విన్న అభిమానులు “నిజమైన గ్యాంగ్‌స్టర్ పవన్ కళ్యాణ్” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. సుజిత్ దర్శకకత్వంలో వచ్చిన ఓజీ సినమా 2025లో హైఎస్ట్ గ్రాసర్గా నిలిచిన విషయం తెలిసిందే.

