BMW Teaser: మాస్ మహారాజా రవితేజ ఎప్పుడూ వైవిధ్యమైన కథలతో, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా ఆయన నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. టైటిల్‌లోనే ఎంతో వెరైటీని చూపించిన రవితేజ, ఈసారి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో మన ముందుకు వస్తున్నారు. సాధారణంగా రవితేజ సినిమాల్లో మాస్ యాక్షన్, డ్యాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఆయన ఒక భర్తగా కనిపించబోతున్నారు. పెళ్లయిన ప్రతి మగాడు తన భార్య దగ్గర పడే ఇబ్బందులు, వారి ఆంక్షల మధ్య నలిగిపోయే భర్తల వేదనను దర్శకుడు కిషోర్ తిరుమల చాలా హాస్యభరితంగా మలిచారు. టీజర్‌లో రవితేజ చెప్పే డైలాగులు, ఆయన హావభావాలు ప్రతి భర్తకూ తమ సొంత కథలా అనిపించేలా ఉన్నాయి.
Read also-Pawan Kalyan: సుజిత్‌కి పవన్ కళ్యాణ్ కారు గిఫ్ట్‌గా ఇచ్చింది అందుకే!.. సినిమా కోసం అంతపని చేశాడా?
టీజర్ ను చూస్తుంటే.. మాస్ మహారాజ్ రవితేజ మాస్ యాక్షన్ ఈ సారి పక్కకు పెట్టి ఫ్యామిలీ డ్రామాతో రాబోతున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భర్తలు చేసే చిలిపి పనులు ఎలా ఉంటాయో వారికి పర్యావశానం ఏ రేంజ్ లో ఉంటుందో తెలిజేసేందుకే ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి టీజర్ మొదలవ గానే రవితేజ ముందుగా సైకాలజిస్ట్ దగ్గరకు వెళతాడు.. ఎందుకంటే తనకు ఇంతకు మందే పెళ్లి అవుతుంది. అది తెలిసి కూడా వేరే అమ్మాయి.. అశికా రంగనాధన్ తో ప్రేమలో పడతాడు.. తన భర్త ఎప్పుడూ శ్రీ రామ చంద్రుడు అనుకుంటంది రవితేజ భార్య డింపుల్ హయాతి. అయితే భర్యకు ద్రోహం చేసి తన ఎందుకు తప్పు చేశాడో తెలుసుకుందామని సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్తాడు రవితేజ. ఈ మధ్యలో జరిగే సన్నివేశాలు.. కామిడీ యాంగిల్ ఎలా ఉంటుందో ఈ టీజర్ ను చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 13, 2026న విడుదల కానుంది.
Read also-Pawan Kalyan: సుజిత్‌కి పవన్ కళ్యాణ్ కారు గిఫ్ట్‌గా ఇచ్చింది అందుకే!.. సినిమా కోసం అంతపని చేశాడా?

