Haritha Haram: అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన హరితహారం (Haritha Haram) కార్యక్రమం బృహత్ కార్యక్రమమేనా.. నిజంగానే హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల బ్రతుకుతున్నాయా..? అనేది ఇప్పటివరకు ఎలాంటి అధికారిక లెక్కలు వెల్లడించకపోవడం గమనార్హం. తెలంగాణలో హరితహారం కార్యక్రమం జులై 3, 2015న అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిలుకూరి బాలాజీ దేవాలయంలో రాష్ట్రంలో చెట్ల విస్తీర్ణం పెంచడం అడవులను పునరుద్ధరణ కోసం ప్రారంభించారు. తెలంగాణ భూభాగంలో 33% మొక్కలను నాటి పచ్చదనం కనిపించాలంటే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 2016 లోనే 46 కోట్ల మొక్కలు నాటామని అప్పటి ప్రభుత్వం చెప్పింది.
రూ. 5230 కోట్లు ఖర్చు
ఈ ఈ హరితహార కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు రాష్ట్ర బడ్జెట్ 10822 కోట్లు కేటాయించింది. హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలో మొత్తం 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకోగా, 2021 మీ వరకు దాదాపు 2017 కోట్ల మొక్కలను నాటినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ఇందుకోసం రూ. 5230 కోట్లు ఖర్చు చేసింది. 2019 2021 మధ్య అటవీ ప్రాంతం విస్తీర్ణంలో 632 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో దేశంలోనే అటవీ ప్రాంతంలో తెలంగాణ రెండో రాష్ట్రంగా నిలిచిందని 2022 డిసెంబర్ 14న కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే అధికారికంగా రాజ్యసభలో ప్రకటించాడు. 2023 జూన్ నాటికి పదివేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి 273.33 కోట్ల మొక్కలు నాటినట్టుగా అప్పటి తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
Also Read: Hyderabad Rains: రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతం.. జలమయమైన సిటీ రోడ్లు
6,298 ఎకరాల విస్తీర్ణంలో 211 బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు
13657 ఎకరాల విస్తీర్ణంలో 19472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. 6,298 ఎకరాల విస్తీర్ణంలో 211 బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లుగా అప్పటి ప్రభుత్వం వెల్లడించింది. ఒక లక్ష 691 కిలోమీటర్ల మేర రాష్ట్ర మొత్తం రహదారులపై వణాలను విస్తరించి ఉన్నాయని చెబుతుంది. అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేటాయించిన 10, 822 కోట్లు ఖర్చు చేసి 273.33 కోట్ల మొక్కలు నాటింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జూలై 3,2015 న హరితహారం కార్యక్రమం మొదలుపెట్టి తొమ్మిది సంవత్సరాల్లో 9 విడతలుగా రూ.10,822 కోట్లు ఖర్చు చేసి 273.33 కోట్ల మొక్కలను నాటింది. మరి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నాటిన లెక్కలకు సరిపడా మొక్కలు ఇప్పుడు బ్రతికి ఉన్నాయా.. వాటి సంరక్షణ చర్యలు జరుగుతున్నాయా.. నాటిన మొత్తం మొక్కల్లో ఇప్పటివరకు ఎన్ని మొక్కలు బ్రతికి ఉన్నాయో..? రికార్డులు ఉన్నాయా..? అంటే సమాధానం లేకపోవచ్చు.
మొక్కల పేరుతో ప్రభుత్వ సొమ్ముకు గండి
కొన్ని సంవత్సరాల నుంచి హరితహారం పేరుతో గ్రామాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. గ్రామాల రహదారికి ఇరువైపులా కూడా అధికారులు మొక్కలు నాటించారు. గత ప్రభుత్వ హయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం మొక్కల కార్యక్రమం ఇప్పుడు ప్రభుత్వంలో తూతూ మంత్రంగా జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా గ్రామాలలో మొక్కలు నాటుతూనే ఉన్నారని , రాష్ట్రంలో మొక్కల పేరుతో అధికారులు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ప్రజల్లో వెలువెత్తుతున్నాయి.
మొక్కలు నాటుతున్నారు సరే రక్షణ ఏది
మొక్కలు నాటుతున్నారు..కానీ ఆ మొక్కకు సరైన రక్షణ ఇవ్వకపోవడంలో అధికారులు విఫలమైతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే మొక్కలకి ఇలా జరుగుతుందని,మొక్కలకు సరైన రక్షణ ఇవ్వకపోవడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆనాటి నుంచి నేటి వరకు కూడా మొక్కలు నాటుతోనే ఉన్నా నాటిన మొక్కకు సరైన రక్షణ ఇవ్వకపోవడం వల్లనే ఆ మొక్క స్థానంలో మళ్ళీ మళ్ళీ వేరే మొక్కలు నాటాల్సిన పరిస్థితి వస్తుంది. దానివలన ప్రభుత్వ నిధులు అధికారులే దుర్వినియోగం చేస్తున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇటీవలే ఏన్కూరు మండలంలోని ఒక గ్రామంలో రహదారి పక్కన ఉన్న కొన్ని చెట్లు తొలగిస్తే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. పాత చెట్లు తొలగించినప్పుడు ఏం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పలుచోట్ల హరితహారం బోర్డు కూడా లేకపోవడం గమనార్హం.
Also Read: Mirai Movie: ‘మిరాయ్’లో మంచు మనోజ్ చేసిన పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?